Gold And Silver Price Today : మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,580 పెరిగగా, వెండి కిలో రూ.8,000 ఎగబాకింది.
విధాత : అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి. వెనిజుల దేశంపై అమెరికా దాడుల పరిణామం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై పడింది. ముఖ్యంగా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమైంది. దీంతో సోమవారం
మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1580 పెరిగి రూ. 1,37,400కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.14,50 పెరిగి రూ.1,25,950కి వద్ద కొనసాగుతుంది. గడిచిన 5రోజుల్లో 3సార్లు బంగారం ధరలు పెరిగాయి.
వెండి ధరలు మళ్లీ పైపైకి..
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కమోడిటీ మార్కెట్లపై పడటంతో వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కిలో వెండి రూ.8000పెరిగి రూ.2,65,000కు చేరింది. డిసెంబర్ 27న ఒకేసారి 31వేలు పెరిగిన వెండి ఆ తర్వాత తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం రూ.2.65,000వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో బంగారం, వెండి, రాగి, ముడి చమురు, గ్యాసోలిన్ వంటి వస్తువుల ధరలు పెరుగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Narayanpet : విద్యార్థుల డేంజర్ జర్నీ…చూస్తే దడదడే!
Anasuya | అనసూయని హీరోయిన్ రాశి అంత మాట అనేసింది ఏంటి.. వైరల్ అవుతున్న కామెంట్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram