Narayanpet : విద్యార్థుల డేంజర్ జర్నీ…చూస్తే దడదడే!
నారాయణపేట జిల్లాలో బస్సుల కొరతతో విద్యార్థినిలు ఓపెన్ ఆటోకు వేలాడుతూ పాఠశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విధాత : విద్యాసంస్థలకు సమయానికి చేరుకునేందుకు విద్యార్ధులు నిత్యం పడే కష్టాలు సాధారణంగా మారిపోయాయి. అయితే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో మద్దూరు మండలంలో పాఠశాల విద్యార్థినిలు ప్రమాదరకంగా బడికి ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
సమయానికి పాఠశాలకు వెళ్లాలనే తపనతో విద్యార్థులు బొలేరో ఒపెన్ ఆటో వాహనానికి వేలాడుతూ ప్రమాదకర ప్రయాణాన్ని సాగించారు. వీపులపై పుస్తకాల బ్యాగ్ ల బరువును మోస్తూ..పాఠశాలకు సకాలంలో చేరుకునే క్రమంలో విద్యార్థినిలు ఈ సాహస ప్రయాణం చేశారు. ప్రయాణం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగినా..చివరకు సడన్ బ్రేక్ వేసినా ఆటోలో వేలాడుతున్న విద్యార్థినిలకు ముప్పు తప్పదు. అయినా ప్రాణాలకు తెగించి వారు బడికి వెళ్లేందుకు ప్రమాదకర ప్రయాణం చేయడం ఆందోళన కరం.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన విద్యార్థినిల ప్రమాదకర ప్రయాణానికి సంబంధించిన ఈ వీడియోలను ప్రతిపక్ష పార్టీల వైరల్ చేస్తున్నాయి. బస్సుల కొరత వల్లే ఇలా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నామని విద్యార్థినిలు వాపోయారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం విద్యార్థినిలకు కావాల్సిన బస్సులు ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో చెప్పినట్లుగా స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Anasuya | అనసూయని హీరోయిన్ రాశి అంత మాట అనేసింది ఏంటి.. వైరల్ అవుతున్న కామెంట్స్
Jolin Tsai Performance On Anaconda : అద్బుతం..అనకొండ పాముపై యువతి స్వారీ వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram