Makthal | బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు యువకుల దుర్మరణం

కర్ణాటక ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది

Makthal | బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు యువకుల దుర్మరణం

మక్తల్ వద్ద సంఘటన

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కర్ణాటక ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నారాయణ పేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

కాగా.. మృతి చెందిన ఇద్దరు యువకులు మక్తల్ పట్టణంలో ఫోటో స్టూడియో పనిచేస్తున్న రఘు, వెంకటేష్‌గా గుర్తించారు. గాయపడిన మరో యువకుడు మహేష్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.