ఉద్రిక్తతలు రేపిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

మక్తల్ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఆందోళన చేపట్టింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 10, 2026, 2:41 pm IST
Read Time: 5 mins
ఉద్రిక్తతలు రేపిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ బలవన్మరణం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తించింది. సోమవారం సాయంత్రం జరిగిన ప్రచార కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణతో కలిసి పాల్గొన్న మహదేవ్.. రాత్రి వరకు కూడా కార్యకర్తలతో ఎన్నికల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. అనంతరం అదే రాత్రి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదానికి..రాజకీయంగా వివాదానికి దారి తీసింది.

మహదేవప్ప ఆత్మహత్యకు మంత్రి వాకిటి శ్రీహరి ఒత్తిళ్లు కారణం అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య అంశాన్ని లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఎంపీ డీకే అరుణ మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా పోలీసులు మహాదేవయ్య భార్య,కుమారుడి సంతకాలు తీసుకున్నారని అరుణ ఆరోపించారు. తప్పుడు ఎఫ్ఐఆర్ ను విత్ డ్రా చేసుకోవాలని, అందరి సమక్షంలో బాధిత కుటుంబం పోలీసులకు ఏం చెబుతారో అది ఫిర్యాదుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే బీజేపీ ఆరోపణలు కొట్టిపారేసిన మంత్రి శ్రీహరి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటూ పోలీసులను కోరారు. బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారంటూ కాంగ్రెస్ మీడియా సెల్ ప్రతినిధి: సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మహాదేవప్ప ఆత్మహత్యకు రాంచందర్ రావు, డీకే అరుణ బాధ్యత వహించాలని, సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేస్తేనే బీజేపీ నేత సూసైడ్ చేసుకున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మహాదేవప్ప మరణం రెండు పార్టీల మధ్య రాజకీయ రగడను రాజేసింది.

మహాదేవప్ప మరణానికి అధికార కాంగ్రెస్ పార్టీనే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు మంగళవారం తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పులాటలో ఖైరతాబాద్‌ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లేదని.. వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఘటనపై అన్ని కోణాల నుంచి విచారణ కొనసాగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

India-Pakistan T20 Clash | కొలంబోలో భారత్-పాక్‌ టీ20 మ్యాచ్.. విమాన ఛార్జీల‌కు రెక్క‌లు
Girl Child | ఆ ఆడ‌బిడ్డ‌కు 130 గ్రామాల ఆశీర్వాదం..! ప్ర‌త్యేక‌త తెలిస్తే షాక్..!!