మోదీపై కేసు నమోదు చేయాలి: వీహెచ్

ప్రధాని మోదీ విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీసీ కులగణన అంశంపైనా మోదీపై విమర్శలు గుప్పించారు.

మోదీపై కేసు నమోదు చేయాలి: వీహెచ్

విద్వేష ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహదారు వీ. హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ లో బీజేపీ మోదీ సభ చూసి జనాలు నవ్వుకుంటున్నారని , కాంగ్రెస్ పార్టీపై మోదీ దుర్మార్గమైన వాఖ్యలు చేశారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని
ముస్లిం, మావోవాదీ పార్టీ అనడం తప్పు అని, ముస్లింలు మనుషులు కాదా? ముస్లింలు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదా అని ప్రశ్నించారు.

మోదీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడనీ, ఆరెస్సెస్ ఏం చెప్తే మోదీ అది చేస్తాడని విమర్శించారు. బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మోదీకి లేదు అని, తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తాం అన్నారు.

ఓబీసీ కాలం లేకపోతే జనగణనలో బీసీలు పాల్గొనవద్దని.. మోదీ చాయ్ వాలా లాగా మాట్లాడలేదు అని,అంబానీ, అదానీలతో సంబంధమున్న కోటీశ్వరుడు మోదీ అని వీహెచ్ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ కల్పించుకొని మోదీతో మాట్లాడి బీసీ కులగణన చేయమని మోదీకి చెప్పాలి అని పేర్కొన్నారు. బీసీల లెక్క తీయకపోతే మాకు న్యాయం జరగదు అని, బీసీలను మోదీ మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. 60కోట్ల మందికి మోదీ అన్యాయం చేస్తున్నారన్నారు.

బీసీలపై మోదీకి చిత్తశుద్ధి లేదు, అంబానీ, అదానీలకు మాత్రమే మోదీ సహాయం చేస్తాడు అని, మేం అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? మోదీలో ఇప్పటికైనా మార్పు రావాలి అని అన్నారు.

ఇవి కూడా చదవండి :

కవిత టీఆర్ఎస్ జోరు.. మే 20 నుండి జెండా పండుగ
నేడు, రేపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు