నేడు, రేపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

హైదరాబాద్‌లో నిర్వహణ పనుల కారణంగా నేడు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | May 11, 2026, 2:03 pm IST
Read Time: 3 mins
నేడు, రేపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

హైదరాబాద్ నగరంలో నేడు(11వ తేదీ), రేపు(12వ తేదీ) పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణ సంబంధిత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది.

పూర్తిగా రద్దయిన రైళ్లు:

ఉమ్దానగర్ – లింగంపల్లి (ట్రైన్ నెం. 47164)
లింగంపల్లి – ఫలక్ నుమా (ట్రైన్ నెం. 47191)
ఫలక్ నుమా – లింగంపల్లి (ట్రైన్ నెం. 47170)
ఫలక్ నుమా – ఉమ్దానగర్ (ట్రైన్ నెం. 47250)

పాక్షికంగా రద్దయిన రైళ్లు :

రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను నిర్ణీత స్టేషన్ల మధ్య నిలిపివేశారు. లింగంపల్లి – ఉమ్దానగర్ (47210): సికింద్రాబాద్ – ఉమ్దానగర్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. ఉమ్దానగర్ – లింగంపల్లి (47203): ఉమ్దానగర్ – సికింద్రాబాద్ మధ్య రద్దయింది.ఫలక్ నుమా – లింగంపల్లి (47157, 47166): ఈ రైళ్లు ఫలక్ నుమా – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవవు. లింగంపల్లి – ఫలక్ నుమా (47179, 47190, 47187): ఈ సర్వీసులు సికింద్రాబాద్ – ఫలక్ నుమా మధ్య పాక్షికంగా నిలిపివేయబడ్డాయి.

నగరంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ మార్పులను గమనించి ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే కార్యకలాపాల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Tata Nexon | రూ.10లక్షల్లోనే పనోరమిక్ సన్‌రూఫ్.. టాటా నెక్సన్ కొత్త వేరియంట్ లాంచ్!
Terrace Garden | మట్టి లేకుండానే టెర్రస్‌పై గార్డెనింగ్.. సమ్మర్‌లో ఏసీ అవసరం లేకుండా చేసిన 70 ఏళ్ల వృద్ధుడి ఆలోచన!