MP Dharmapuri Arvind : బీఆర్ ఎస్ కథ ముగిసింది..వచ్చే ఎన్నికల్లో బీజేపీ..కాంగ్రెస్ లకే ఛాన్స్

బీఆర్ఎస్ కథ ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు.

MP Dharmapuri Arvind : బీఆర్ ఎస్ కథ ముగిసింది..వచ్చే ఎన్నికల్లో బీజేపీ..కాంగ్రెస్ లకే ఛాన్స్

విధాత: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని..ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని బీజేపీ ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు. కేటీఆర్ కు వచ్చే ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయదన్నారు. కేటీఆర్ సిరిసిల్ల చిత్తు పేపర్ వంటివాడన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదని నేను బాండ్ పేపర్ రాసిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ లేదా కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ అర్ధరాత్రి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయాడా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్ లలో ఎందుకు కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేయడం లేదంటూ అర్వింద్ నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని జనం నమ్మే రోజులు పోయాయన్నారు. 2028 వరకు బీఆర్ఎస్ నేతల్లో ఎవరు జైల్లో ఉంటారో తెల్వదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిదేనన్నారు.