Tollywood Heroes | మూడు నెలల్లో నలుగురు స్టార్ హీరోల నుంచి బిగ్ అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Tollywood Heroes | టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విశ్రాంతి లేకుండా షూటింగ్స్ కొనసాగిస్తున్నారు.

  • By: sn |    movies |    Published on : Feb 22, 2026 3:00 PM IST
Tollywood Heroes | మూడు నెలల్లో నలుగురు స్టార్ హీరోల నుంచి బిగ్ అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Tollywood Heroes | టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విశ్రాంతి లేకుండా షూటింగ్స్ కొనసాగిస్తున్నారు. అయితే సినిమాల కంటే ముందుగా వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వచ్చే మూడు నెలలు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం తీసుకురానున్నాయి.

రామ్ చరణ్ – ‘పెద్ది’, ‘RC 17’పై ఆసక్తి

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ Ram Charan ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు Buchi Babu Sanaతో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి” వీడియో సాంగ్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న ‘RC 17’ ప్రాజెక్ట్‌పై కూడా అప్డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అల్లు అర్జున్ – ‘AA 22’, ‘AA 23’పై ఎక్స్‌పెక్టేషన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun ప్రస్తుతం దర్శకుడు అట్లీAtleeతో ‘AA 22’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. గత సంవత్సరం బర్త్ డే సందర్భంగా అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల కాగా, ఈసారి ఏప్రిల్ 8న టైటిల్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అదే విధంగా దర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌Lokesh Kanagarajతో చేయనున్న ‘AA 23’ సినిమా గురించి కూడా ఏదైనా క్లారిటీ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ – ‘NTRNeel’, ‘దేవర 2’పై హైప్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ N.T.R Jr. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్‌ Prashanth Neelతో చేస్తున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతోంది. ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.

అదే సమయంలో దర్శకుడు కొర‌టాల శివ‌Koratala Sivaతో చేయాల్సిన ‘దేవర 2’పై కూడా ఏదైనా అప్డేట్ వస్తుందనే ప్రచారం సాగుతోంది.

మహేష్ బాబు – రాజమౌళి కాంబోపై ఆసక్తి

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు Mahesh Babu, దర్శకుడు రాజ‌మౌళి Rajamouli కాంబినేషన్‌లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా ఏదైనా పోస్టర్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. లేకపోతే మే 31న కృష్ణ జయంతి సందర్భంగా అప్డేట్ రావచ్చని అభిమానులు భావిస్తున్నారు.

అఖిల్ – ‘లెనిన్’ నుంచి సర్‌ప్రైజ్?

యువ హీరో అఖిల్ అక్కినేని Akhil Akkineni ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను Nagarjuna తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ముందుగా మే 1న రిలీజ్ అనుకున్నప్పటికీ వాయిదా పడింది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ప్రమోషనల్ మెటీరియల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి మార్చిలో రామ్ చరణ్, ఏప్రిల్‌లో అల్లు అర్జున్ మరియు అఖిల్, మేలో ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు సినిమాల నుంచి వరుస అప్డేట్లు రాబోతున్నాయి. ఈ మూడు నెలలు టాలీవుడ్ అభిమానులకు నిజంగా ఫెస్టివల్ సీజన్‌లా మారనున్నాయి.