Bill Gates Amaravati Visit| ఏపీలో సచివాలయంలో చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ఏపీ అమరావతిలో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతికి వెళ్లిన బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ లను, మంత్రి నారా లోకేశ్‌లతో భేటీ అయ్యారు.
అమరావతి : గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ఏపీ అమరావతిలో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతికి వెళ్లిన బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ లను, మంత్రి నారా లోకేశ్‌లతో భేటీ అయ్యారు.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు చంద్రబాబు వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చంద్రబాబు ఈ సందర్బంగా బిల్ గేట్స్ తో చర్చించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిపై వారు చర్చించారు.
ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని, డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం చంద్రబాబు తెలిపారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని, ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ అభినందించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.
ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని… అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని తెలిపిన సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు చంద్రబాబు వివరించారు. గ్రేట్ వర్క్ అంటూ ఈ సందర్బంగా బిల్ గేట్స్ కితాబునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram