Pawan – Balayya | పిక్చర్ అదిరింది .. అసెంబ్లీలో పవన్ కల్యాణ్- బాలకృష్ణ భేటీ.. రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశం
Pawan - Balayya | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో కలిశారు. పవన్ కల్యాణ్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీ సుమారు కొంతసేపు కొనసాగినట్లు సమాచారం.
Pawan – Balayya | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో కలిశారు. పవన్ కల్యాణ్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీ సుమారు కొంతసేపు కొనసాగినట్లు సమాచారం. హిందూపురం నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
గత వివాదాల నేపథ్యం
గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల పెంపు అంశంలో మెగాస్టార్ చిరంజీవి వ్యవహార శైలిని పరోక్షంగా విమర్శించినట్టు ఆయన వ్యాఖ్యలు ఉండటంతో సినీ, రాజకీయ వర్గాల్లో వివాదం రేగింది. ఆ సమయంలో మెగాస్టార్ అభిమానులతో పాటు జనసేన వర్గాల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పవన్ కల్యాణ్ లేదా నాగబాబు స్పందించకపోవడం కూడా చర్చకు దారి తీసింది. అయితే చిరంజీవి స్వయంగా వివాదాన్ని పెద్దది కాకుండా చల్లార్చే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంతో తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో పవన్ కల్యాణ్ – బాలకృష్ణ భేటీ జరగడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. గత విభేదాల తర్వాత ఇద్దరూ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చర్చలో సినీ రంగ అంశాలూ?
ఈ భేటీలో కేవలం నియోజకవర్గ అభివృద్ధి సమస్యలే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం త్వరలో నంది అవార్డుల ప్రదానానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉండగా, సినీ ప్రముఖుల సూచనలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి
పవన్ కల్యాణ్ – బాలకృష్ణ ఇద్దరూ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, ఒకేసారి సినీ రంగంలోనూ ప్రభావం చూపుతున్న వ్యక్తులు కావడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు, సినీ రంగానికి సంబంధించిన నిర్ణయాల్లో ఈ సమావేశం ప్రభావం ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఈ భేటీపై మరింత చర్చకు దారితీస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram