OTT Movies | కొత్త ఏడాది తొలి వారమే బ్లాక్‌బస్టర్ హడావిడి… థియేటర్లు, ఓటీటీల్లో కంటెంట్ వరద

OTT Movies | కొత్త ఏడాది ప్రారంభంతోనే ఎంటర్‌టైన్‌మెంట్ రంగం ఫుల్ జోష్‌లోకి వచ్చేసింది. జనవరి 5 నుంచి 11 వరకు ఉన్న ఈ వారం సినీ ప్రియులకు నిజంగా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. థియేటర్లలో భారీ స్టార్ సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వరుసగా డిజిటల్ రిలీజ్‌లు… మొత్తంగా సినిమా అభిమానులకు విశ్రాంతి లేకుండా వినోదం అందించేందుకు పరిశ్రమ సిద్ధమైంది.

  • By: sn |    movies |    Published on : Jan 05, 2026 4:20 PM IST
OTT Movies | కొత్త ఏడాది తొలి వారమే బ్లాక్‌బస్టర్ హడావిడి… థియేటర్లు, ఓటీటీల్లో కంటెంట్ వరద

OTT Movies | కొత్త ఏడాది ప్రారంభంతోనే ఎంటర్‌టైన్‌మెంట్ రంగం ఫుల్ జోష్‌లోకి వచ్చేసింది. జనవరి 5 నుంచి 11 వరకు ఉన్న ఈ వారం సినీ ప్రియులకు నిజంగా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. థియేటర్లలో భారీ స్టార్ సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వరుసగా డిజిటల్ రిలీజ్‌లు… మొత్తంగా సినిమా అభిమానులకు విశ్రాంతి లేకుండా వినోదం అందించేందుకు పరిశ్రమ సిద్ధమైంది. ప్రత్యేకంగా జనవరి 9 ఒక్కరోజే ఏకంగా 16 చిత్రాలు విడుదల కావడం ఈ వారానికి హైలైట్‌గా మారింది.

థియేటర్లలో స్టార్ వార్

ఈ వారం బాక్సాఫీస్ వద్ద అసలైన పోటీ కనిపించనుంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో థియేటర్లకు పండగ వాతావరణం నెలకొననుంది.

ది రాజా సాబ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ కొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

జన నాయగన్

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై కోలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనవరి 9న థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ ఫ్యాన్స్‌కు ఇది ఎమోషనల్ మూమెంట్‌గా మారింది.

ప్రాంతీయ సినిమాలు

బెంగాలీ ప్రేక్షకుల కోసం అంకుష్ హజ్రా నటించిన ‘నారీ చరిత్రో బిజయ్ జోటిల్’, ‘కీర్తనేర్ పోర్ కీర్తన్’ చిత్రాలు కూడా జనవరి 9నే విడుదల కానున్నాయి.

హాలీవుడ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్

హాలీవుడ్ నుంచి కూడా ఈ వారం ఆసక్తికరమైన చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. జెరార్డ్ బట్లర్ నటించిన ‘గ్రీన్‌ల్యాండ్ 2: మైగ్రేషన్’, హ్యూ జాక్‌మన్ చిత్రం ‘సాంగ్ సంగ్ బ్లూ’తో పాటు ‘ది క్రోనాలజీ ఆఫ్ వాటర్’, ‘ప్రైమేట్’ వంటి సినిమాలు భారత థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ పండుగ

థియేటర్లకు వెళ్లలేని ప్రేక్షకుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ వారం సూపర్ కంటెంట్‌ను అందిస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో
నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ జనవరి 9 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో మెప్పించాడు.

అలాగే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘దే దే ప్యార్ దే 2’ కూడా అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ఇవే కాకుండా జనవరి 7న ‘షిబోయుగి’ యానిమేష‌న్ సిరీస్, 9న ‘ఆల్ఫా మేల్స్’ సీజన్ 4 స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఇతర ఓటీటీలు

సోనీ లివ్‌లో చారిత్రాత్మక వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’, మలయాళ చిత్రం ‘కాలంకావల్’ జనవరి 9న విడుదలవుతాయి.అమెజాన్ ప్రైమ్ వీడియోలో అదే రోజు నుంచి ‘బాల్తీ’ స్ట్రీమింగ్ కానుంది.
జీ5లో తమిళ సినిమా ‘మాస్క్’, హిందీ డాక్యుమెంటరీ ‘హనీమూన్ సే హత్య’ ప్రేక్షకులను అలరించనున్నాయి.

మొత్తంగా వినోదానికి ఈ వారం ఫుల్ ప్యాక్

ఈ వారం థియేటర్లలో 8 సినిమాలు, ఓటీటీల్లో 9 సినిమాలు/సిరీస్‌లు విడుదలవుతూ మొత్తం 17 కొత్త కంటెంట్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా ఒక్క జనవరి 9నే 16 విడుదల కావడం విశేషం. కొత్త ఏడాది తొలి వారంలోనే సినీ, ఓటీటీ అభిమానులకు ఇంత పెద్ద వినోద విందు దక్కడం నిజంగా అరుదైన సందర్భమని చెప్పవచ్చు.