OTT Movies | ఈ వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!

Ott Movies | ఈ వారం ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పండుగ రాబోతోంది. థియేటర్లలో కొత్త చిత్రాలతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో 25 పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమా నుండి బాలీవుడ్ స్పై థ్రిల్లర్ వరకు విభిన్న జానర్లలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

  • By: sn |    movies |    Published on : Dec 01, 2025 3:04 PM IST
OTT Movies | ఈ వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!

OT Movies | ఈ వారం ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పండుగ రాబోతోంది. థియేటర్లలో కొత్త చిత్రాలతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో 25 పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమా నుండి బాలీవుడ్ స్పై థ్రిల్లర్ వరకు విభిన్న జానర్లలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

థియేటర్లలో…

బాలయ్య “అఖండ 2 తాండవం”

నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న పవర్‌ఫుల్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ 2 తాండవం’ ఈ నెల 5వ తేదీ విడుదలవుతోంది. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త హీరోయిన్గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. పూర్ణ, హర్షాలి కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మించారు. సంగీతం థమన్ అందించారు.

రణవీర్ సింగ్ “ధురంధర్”

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ కూడా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఓటీటీల్లో భారీ రిలీజ్‌లు

థియేటర్ రష్‌తో పాటు ఓటీటీల్లో కూడా కొత్త సినిమాలు, సూపర్‌హిట్ వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

పాంచ్ మినార్ (తెలుగు)

శశివదనే (తెలుగు)

బ్రాట్ (కన్నడ)

కాంతార (హిందీ వెర్షన్)

లాస్ట్ డేస్ ఇంగ్లీష్ – రెంటల్)

బుల్గానియా (ఇంగ్లీష్ – రెంటల్)

రిగ్రెట్టింగ్ యు (ఇంగ్లీష్ – రెంటల్)

ఆర్చిన్ (ఇంగ్లీష్)

థామా

అవాకాత్ కా బాహర్

 

నెట్‌ఫ్లిక్స్
సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ (హిందీ మూవీ)

ఆర్యన్ (తెలుగు మూవీ)

లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్

స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్ సీజన్ 5 – ఇంగ్లీష్ / తెలుగు)

జింగిల్ బెల్ హెయిస్ట్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ)

క్యాచ్ స్టీలింగ్ (ఇంగ్లీష్ మూవీ)

స్టీఫెన్ (డిసెంబర్ 5), ది గర్ల్ ఫ్రెండ్ (డిసెంబర్ 5)

జియో హాట్ స్టార్

ఆన్ పావమ్ పొల్లతాతు (మలయాళం/తెలుగు మూవీ)

బెల్ హెయిర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 4)

డీయస్ ఈరే

ది బ్యాడ్ గాయ్స్ (యానిమేటెడ్ సిరీస్ సీజన్ 2)

సోనీ లివ్

కుట్రమ్ పురింధవన్ (వెబ్ సిరీస్ – డిసెంబర్ 5)

జీ5

రేగాయ్ (తమిళ్ వెబ్ సిరీస్)

ది పెట్ డిటెక్టివ్ (తమిళ్/తెలుగు)

లయన్స్ గేట్ ప్లే

రష్ (ఇంగ్లీష్ మూవీ), ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ)

ఈటీవీ విన్

కరీముల్లా బిర్యానీ పాయింట్

అర్జున్ చక్రవర్తి

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో ప్రేక్షకులకు జానర్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రాబోతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్‌లతో పాటు వెబ్ సిరీస్ ప్రేమికులకు కూడా మంచి లైనప్ సిద్ధంగా ఉంది. సినిమా ప్రేమికులు తమకు నచ్చిన ప్లాట్‌ఫామ్‌లో ఎంటర్టైన్ అవడానికి ఈ వారం ఒక మంచి ట్రీట్ కానుంది.