Dhoni Farm | 38 ఎకరాల్లో ధోనీ టమాటా సాగు.. అది కూడా ఆర్గానిక్ పద్ధతుల్లో
Dhoni Farm | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ( Mahendra Singh Dhoni ).. వ్యవసాయం చేస్తూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. తన సొంతూరులో ఆర్గానిక్ పద్ధతుల్లో( Organic Methods ) టమాటా( tomato crops ) పండిస్తూ.. యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Dhoni Farm | ఒకప్పుడు వ్యవసాయం అంటే రైతులే( Farmers ) చేసేవారు. ఇటీవలి కాలంలో ఇంజినీర్లు, డాక్టర్లు సైతం పొలం బాట పడుతున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో క్రికెటర్లు( Cricketers ) కూడా చేరిపోతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ( Mahendra Singh Dhoni ).. వ్యవసాయం చేస్తూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. తన సొంతూరులో ఆర్గానిక్ పద్ధతుల్లో( Organic Methods ) టమాటా( tomato crops ) పండిస్తూ.. యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని సాంబో గ్రామం( Sambo Village )లో ధోనీకి వ్యవసాయ క్షేత్రం ఉంది. దాదాపు 38 ఎకరాల్లో టమాటా సాగు( tomato crops ) చేస్తున్నారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న ధోనీ టమాటాకు మార్కెట్‌లో కూడా విరివిగా డిమాండ్ ఉంది.
ధోనీ టమాటాకు రాంచీ మార్కెట్‌లో భారీ డిమాండ్..
అయితే టమాటా సాగు విషయంలో ధోనీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సైంటిఫిక్ పద్ధతుల్లో.. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తన వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక రెడ్, లోకల్, చెర్రీతో పాటు హైబ్రీడ్ వంటి రకాలకు చెందిన టమాటాను 38 ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవలే ఈ పంట చేతికొచ్చింది. నాణ్యతతో పాటు రుచిగా ఉన్న ఈ టమాటాకు రాంచీ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. రాంచీ వ్యాపారులే కాదు.. ఇతర ప్రదేశాల నుంచి వ్యాపారులు వచ్చి ధోనీ పండించిన టమాటాను కొనుగోలు చేస్తున్నారు.
క్రిమిసంహారక మందులు కూడా ఆర్గానిక్‌గానే
ఇక ధోనీ వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలకు ఎలాంటి రసాయన ఎరువులను వాడటం లేదు. క్రిమిసంహారక మందులు కూడా ఆర్గానిక్‌గానే తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడను వినియోగిస్తారు. సంప్రదాయ, సహజ సిద్ధమైన పద్ధతులను వాడుతున్నారు.
కూరగాయలే కాదు.. పండ్లు కూడా పండిస్తున్న ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ కేవలం టమాటాలు పండించడానికే పరిమితం కాలేదు. క్యాబేజీ, బఠానీలు, బ్రకోలీ, గుమ్మడికాయ, బెండకాయలు, వంకాయలు పండిస్తున్నారు. పైనాపిల్, మామిడి, జామ, బొప్పాయి పండ్లను పండిస్తున్నారు. ప్రస్తుతం టమాటా పంట అధిక దిగుబడి సాధించడంతో.. ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram