Rogue Waves | స్పీడ్ బోటును మింగేసిన రాకాసి అల.. షాకింగ్ వీడియో
అమెరికా (America) కాలిఫోర్నియా (California) తీరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ స్పీడ్ బోటు (speedboat)ను రాకాసి అల మింగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Rogue Waves | సముద్రంలో ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి కాదు. సముంద్రం ఆటుపోట్లకు గురవుతుంటుంది. ఒక్కసారిగా అలలు విరుచుకుపడుతుంటాయి. ఏమాత్రం తేడా వచ్చిన అలలు (Rogue Waves) మనల్ని మింగేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
అమెరికా (America) కాలిఫోర్నియా (California) తీరంలో ఈనెల 7న ఓ ఆరుగురితో ఓ స్పీడ్ బోటు (speedboat) తీరంవైపు దూసుకెళ్తోంది. అదే సమయంలో ఓ రాకాసి అల ఎగసిపడింది. ఆ స్పీడ్ బోటును చెల్లాచెదురు చేసింది. అలల తీవ్రతకు బోటు బోల్తాపడింది. అందులోని వారంతా నీటిలో పడిపోయారు. అయితే, ప్రమాదాన్ని గమనించిన తీరప్రాంత భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వారితోపాటూ సర్ఫింగ్‌కోసం వచ్చిన పర్యాటకులు సైతం ప్రమాదంలోపడిన వారిని రక్షించేందుకు వెళ్లారు. అలా బోటులోని ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
En medio de un fuerte oleaje invernal el 7 de febrero de 2026, la costa de #California fue testigo de un acto de valentía pura.
Cuando un bote con cuatro niños volcó, los surfistas presentes se convirtieron en la única esperanza. Ian Anderson, con solo 14 años, remó hacia los… pic.twitter.com/7CFaqZmRrw
— Jhannely González | Periodista (@gazareportes_ve) February 15, 2026
ఇవి కూడా చదవండి :
Divorce | పెళ్లై 58 ఏళ్లు.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన వృద్ధ జంట
తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక వాయిదా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram