Epstein Files | ఎప్ స్టీన్ జాబితాలో 300 మంది ప్రముఖులు…జాబితా విడుదల చేసిన యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 300 మంది ప్రముఖుల పేర్లు విడుదల. ట్రంప్, ఒబామా, క్లింటన్, గేట్స్ తదితరుల పేర్లు జాబితాలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం.
విధాత, హైదరాబాద్ : జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్… ఈ పేరు కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుతున్నది. ప్రచార, ప్రసార సాధనాలు, డిజిటల్ మీడియాలో ఈయన పేరు హోరెత్తుతున్నది. ఈయనకు సంబంధించిన సమాచారం రోజుకో రకంగా రకరకాలుగా కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వస్తున్న వివరాలనే ఎప్ స్టీన్ ఫైల్స్ గా ప్రజలకు సుపరిచితం అయ్యాయి. లైంగిక నేరస్థుడు జేఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం వివాదం ప్రపంచ కుబేరులతో పాటు యూఎస్ రాజకీయ వేత్తలను నిద్ర లేకుండా చేస్తున్నది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) సుమారు 300 మంది ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పేరొందిన వ్యక్తుల జాబితాను ఆదివారం నాడు అధికారికంగా విడుదల చేసింది. అమెరికన్ కాంగ్రెస్ కు హామీ ఇచ్చిన విధంగా ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ప్రజల ముందు పెట్టారు.
యూఎస్ అటార్నీ జనరల్ పమేలా జే బొండి, డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంకే మాట్లాడుతూ, ఎఫ్ స్టీన్ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన పత్రాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 6 మిలియన్ పేజీల డాక్యుమెంట్లను అధ్యయనం చేసి సమీక్షించిన తరువాత 3.5 మిలియన్ పేజీలను విడుదల చేయడం జరిగింది. ఈ సెక్స్ కుంభకోణంలో బాధితుల పేర్లను తొలగించడం జరిగిందని, వారి వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని పత్రాల విడుదలకు న్యాయపరమైన వ్యాజ్యాలు అడ్డుగా ఉన్నాయని, కోర్టు ఆమోదం లభించిన తరువాత విడుదల చేయనున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట, ఇబ్బంది, రాజకీయ సున్నితత్వం వంటి కారణాలతో ఏ ఒక్క డాక్యుమెంట్ ను కూడా బహిర్గతం చేయకుండా నిలిపివేయలేదని పేర్కొన్నారు. దశల వారీగా విడుదల చేస్తున్న జాబితాలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖుల పేర్లు ఉండడం ప్రపంచ దేశాల్లోని ప్రజలను షాక్ కు గురి చేస్తున్నది. పమేలా, టాడ్ బ్లాంకే లు ఆదివారం నాడు విడుదల చేసిన జాబితాలో ఎందరో ప్రముఖులు ఉన్నారు.
ప్రజలకు సుద్దులు, సూక్తులు చెప్పేవారు ఉన్నారు
ప్రజలకు సుద్దులు చెప్పేవారు, దైవ భక్తితో బతకాలని సూక్తులు ప్రవచించేవారు, అగ్రరాజ్యాధినేతగా ఉన్నవారు, తమ సంపదను ఉదారంగా దానం చేస్తున్నామని ప్రచారం చేసుకునేవారి పేర్లు ఈ జాబితాలో ఉండడం విశేషం. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లి ఒబామా, బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్, మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, బ్రిటన్ రాజవంశస్థుడు ప్రిన్స్ హారీ, అమెరికా నటుడు వుడీ అలెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హరిస్, మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, వాటికన్ సిటీలోని క్యాథలిక్ చర్చి హెడ్ పోప్ జాన్ పాల్-2, యూఎస్ హౌస్ ఆప్ రిప్రజెంటేటీవ్స్ 52వ స్పీకర్ నాన్సీ పెలోసీ, యూఎస్ మైనారిటీ నాయకుడు హకీం ఎప్రీస్ ఉన్నారు. ఎఫ్ స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని చట్ట సభల ప్రతినిధులు కొద్ది రోజులుగా ఒత్తిడి పెంచడంతో కోట్ల కొద్దీ డాక్యుమెంట్లను పరిశీలించి, వాస్తవమేనని నిరూపించుకున్న తరువాత దశల వారీగా ఈ పత్రాలను విడుదల చేస్తున్నారు. గత వారం చట్ట సభలో ప్రతినిధి థామస్ మాస్సీ తో కలిసి పారదర్శకత చట్టానికి నాయకత్వం వహించిన ప్రతినిధి రో ఖన్నా పలువురి పేర్లను చదివి విన్పించారు. అయితే చాలా మంది ప్రముఖుల పేర్లను దాచిపెట్టారని, ఎప్ స్టీన్ తో సంబంధం లేని వారి పేర్లను కూడా బయటపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ నేపథ్యం
అమెరికా దేశం న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో 1953లో జన్మించిన జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ అమెరికా ఫైనాన్సియర్, బాల సెక్స్ నేరస్థుడు. 1998 లో వర్జిన్ దీవులలోని లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, గ్రేట్ జేమ్స్ ఐలాండు లను కొనుగోలు చేశాడు. తన పలుకుబడి పెంచుకోవడానికి, వేల కోట్లు సంపాదించేందుకు ప్రముఖులకు లైంగిక వాంఛలు తీర్చడానికి రెండు ద్వీపాలను కేంద్రంగా చేసుకున్నారు. 16 సంవత్సరాల లోపు బాల,బాలికలతో విచ్చలవిడి శృంగారంతో సాగే పార్టీల కోసం అమెరికా, ప్రపంచదేశాల్లో ఉన్నత వర్గాల వ్యక్తులు హాజరై అంతులేని ఆనందం పొందేవారు. 2005లో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఆయన బాగోతాలు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నాయి. 2008 లో దోషిగా తేలడంతో 18 నెలల పాటు సాధారణ శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. 2019లో మళ్లీ చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుగుతుండగానే న్యూయార్క్ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ప్రపంచ ప్రముఖుల పేర్లు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఎప్ స్టీన్ ను జైలులోనే గుట్టుగా మట్టుపెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన మరణం తరువాత ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ మైకెల్ బాడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఫ్రీ ది ఆత్మహత్య కాదని గొంతు నులిమి చంపారని తాజాగా ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. జైలు రికార్డులు కూడా తారుమారు చేశారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ నివేదిక కూడా తేల్చడం మరింత అనుమానాలకు తావిస్తున్నది.
ఇవి కూడా చదవండి :
Rogue Waves | స్పీడ్ బోటును మింగేసిన రాకాసి అల.. షాకింగ్ వీడియో
Paddy Bonus 2026 | రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. బోనస్ రూ.514.36కోట్లు విడుదల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram