జలాశయాలలో ఉండాల్సిన ఓ భారీ మొసలి ఒకటి..ఏకంగా పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించి అందరిని భయపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్ తాలూకాలో బదల్‌పారా గ్రామంలోని ఓ పాఠశాల ఆవరణలో ఒక భారీ మొసలి ప్రవేశించింది. అది రాత్రి సమయంలో దర్జాగా రోడ్డు మార్గంలో నడుచుకుంటూ..మెల్లగా పాఠశాల ఆవరణలో వాలిబాల్ కోర్టు మీదుగా స్కూల్ బస్సు, తరగతి గదుల సమీపంలోకి వెళ్లడం వీడియోలో కనిపించింది. మొసలిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 8 నుండి 10 అడుగుల పొడవున్న ఆ మొసలి పాఠశాల మైదానంలో సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించి ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
మొసలి విద్యార్థులు, సిబ్బంది లేని సమయం రాత్రి వేళ పాఠశాల ఆవరణలోకి రావడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదని స్థానికులు వెల్లడించారు. మొసలి సంచారం సమాచారం అందుకున్న అధికారులు దానిని బంధించి నీటి వనరులలో విడిచి పెట్టారని సమాచారం. గుజరాత్‌లో నీటి వనరుల సమీపంలోని మానవ నివాస ప్రాంతాల్లోకి ఈ మొసళ్లు అప్పుడప్పుడు ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రవేశిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. మొసలి పాఠశాల మైదానం ప్రవేశం వీడియో చూసిన నెటిజన్లు..దానికి నీళ్లలో ఉండి బోర్ కొట్టినట్లుందని, అందుకే ఆహారాన్ని వెతికే క్రమంలో సమీప జనావాసంలోకి ప్రవేశించి ఉంటుందని కామెంట్ చేశారు.
Gir Somnath, Gujrat – A massive crocodile strayed into the populated Badalpara village in Veraval taluka of Gir Somnath district, creating panic among residents.The 8 to 10 feet long crocodile was spotted walking through the village’s main road before entering the local… pic.twitter.com/HZXiGyG1iU
— NextMinute News (@nextminutenews7) June 24, 2026
