పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్స్ వచ్చేస్తున్నాయ్ !

హర్మూజ్ జలసంధి సమస్యల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ ఎల్పీజీ నౌకలు భారత్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. దేశానికి 92వేల టన్నుల గ్యాస్ చేరనుంది.

న్యూఢిల్లీ : పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చేరుకోవాల్సిన ఎల్పీజీ, చమురు నౌకలు హర్మూజ్ జలసంధి మార్గంలో చిక్కుకపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల వినతి మేరకు ఇరాన్ పలు దేశాల ఇంధన నౌకలను హర్మూజ్ మార్గంలో అనుమతిస్తున్న నేపథ్యంలో భారత్ ఇంధన నౌకలు సైతం దేశానికి చేరుతున్నాయి. తాజాగా పైన్ గ్యాస్, జగ్ వసంత్ ఎల్పీజీ గ్యాస్ నౌకలు భారత్ తీరానికి బయలుదేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను కేంద్రం విడుదల చేసింది.

పైన్ గ్యాస్, జగ్ వసంత్ ఎల్పీజీ గ్యాస్ నౌకల ద్వారా 92,612 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ భారత్ కు వస్తుంది. రెండు నౌకల్లో కలిపి 55 మంది భారత నావిక సిబ్బంది ఉన్నారు. మార్చి 25 నుంచి 28 మధ్య ఈ రెండు నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయి. హర్మూజ్ వద్ద మరో ఎల్పీజీ నౌకలు చిక్కుకపోయి ఉన్నాయ. వాటిని కూడా భారత్ కు అనుమతించేలా ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తుంది.

ఇవి కూడా చదవండి :

NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
Telangana Petrol Availability | తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత లేదు

Latest News