Gali Janardhan Reddy : గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..బళ్లారిలో మళ్లీ ఉద్రిక్తత

బళ్లారిలో మంటలు! గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి దుండగుల నిప్పు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గమే కారణమని సోమశేఖర్ రెడ్డి ఆరోపణ. ముదురుతున్న రాజకీయ సెగలు..

Gali Janardhan Reddy

విధాత : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి దుండగులు నిప్పు పెట్టిన ఘటన సంచలనంగా మారింది.బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలోని గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన రూ.3కోట్ల విలువైన మోడల్ హౌస్ కు దుండగులు నిప్ప పెట్టారు. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. టన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై గాలి కుటుంబ సభ్యులు బళ్లారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారని గుర్తు చేశారు. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

Allahabad High Court | అలాంటి భ‌ర్త నుంచి భ‌ర‌ణం ఆశించొద్దు : అల‌హాబాద్ కోర్టు
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?

Latest News