King Cobra | కేరళ( Kerala )లోని థైక్కడపురానికి చెందిన షారఫున్నిసా( Sharafunnisa ) వృత్తి రీత్యా హిస్టరీ లెక్చరర్( History Lecturer ) . ఆమె పడన్నక్కడ్‌లోని నెహ్రూ కాలేజీలో విధులు నిర్వర్తిస్తుంది. అయితే ప్రతి రోజు కాలేజీకి తానే స్వయంగా స్కూటర్( Scooter ) నడుపుకుంటూ వెళ్తుంది. అయితే నిన్న షూ, హెల్మెట్ ధరించి స్కూటర్‌పై కాలేజీకి బయల్దేరింది. రైట్ సైడ్ బ్రేక్ వేసినప్పుడు అక్కడ ఏదో తచ్చాడుతున్నట్టు ఆమెకు అనిపించింది. తీరా చూస్తే అది నాగుపాము( King Cobra ).
కానీ ఆమె భయపడలేదు. ఇప్పుడు స్కూటర్ ఆపితే అది తనను కాటేసే అవకాశం ఉందని భావించింది. ఇక రైట్ బ్రేక్ వేయకుండా.. కేవల లెఫ్ట్ బ్రేక్ వేస్తూ ఐదు కిలోమీటర్లు ప్రయాణించింది. భయం గుప్పిట్లోనే ఆమె రైడ్ చేసింది. కాలేజీకి చేరుకున్నాక మెకానిక్‌ను పిలిపించి పామును బయటకు తీశారు. భారీ పొడవున్న నాగుపామును చూసి లెక్చరర్‌తో పాటు సిబ్బంది, విద్యార్థులు షాక్ అయ్యారు.
ఈ సందర్భంగా పారఫున్నిసా మాట్లాడుతూ.. నాగుపాము స్కూటర్‌లో దూరిన తర్వాత కూడా ఐదు కిలోమీటర్లు రైడ్ చేశానంటే నమ్మశక్యంగా లేదన్నారు. కేవలం ప్రాణాలను కాపాడుకునేందుకే బండిని ఎక్కడా ఆపకుండా నడిపానని తెలిపారు. ముందరి బ్రేక్ వేస్తే తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేదని పారఫున్నిసా పేర్కొన్నారు.
