Mini Vande Bharat Train | మినీ వందే భారత్‌ వస్తోంది..! త్వరలో నాలుగు రూట్లలో పరుగులు..!

Mini Vande Bharat Train | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లను డిమాండ్‌ ఉండడంతో మరిన్ని రూట్లలో ప్రవేశపెట్టబోతున్నది. అదే సమయంలో మినీ వందే భారత్‌ రైళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రైలు ఎనిమిది కోచ్‌లతో ఉంటుంది. నాలుగు కొత్త మార్గాల్లో ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భారతీయ రైల్వేకు గర్వకారణమని పేర్కొంటున్నారు. శతాబ్ది కంటే ఎక్కువ వేగంగా పరుగులు […]

Mini Vande Bharat Train | మినీ వందే భారత్‌ వస్తోంది..! త్వరలో నాలుగు రూట్లలో పరుగులు..!

Mini Vande Bharat Train | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లను డిమాండ్‌ ఉండడంతో మరిన్ని రూట్లలో ప్రవేశపెట్టబోతున్నది. అదే సమయంలో మినీ వందే భారత్‌ రైళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రైలు ఎనిమిది కోచ్‌లతో ఉంటుంది. నాలుగు కొత్త మార్గాల్లో ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భారతీయ రైల్వేకు గర్వకారణమని పేర్కొంటున్నారు. శతాబ్ది కంటే ఎక్కువ వేగంగా పరుగులు తీస్తుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సైతం వేగంగా వెళ్తుంది.

ఎనిమిది కోచ్‌లతో..

తాజాగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో గణనీయమైన మార్పులను రైల్వేశాఖ తీసుకురాబోతున్నది. ఇప్పటి వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉండగా.. రాబోయే రోజుల్లో ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టబోతుండగా.. వీటికి మినీ వందేభారత్‌ రైలుగా నామకరణం చేశారు. రైల్వేబోర్డు ఎనిమిది కోచ్‌ల వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తయారీ కోసం ఇంట్రిగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఆర్డర్‌ ఇచ్చింది. ఈ మినీ రైలును ఢిల్లీ – చండీగఢ్‌, చెన్నై-తిరునెల్వేలి, లక్నో-ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్-భోపాల్‌తో సహా పలు మార్గాలను నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మినీ వందే భారత్ రైలు ఎందుకు అవసరం?

ప్రస్తుతం వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో రెండు కోచ్‌లు డ్రైవర్ క్యాబ్‌ల రూపంలో ఉంటాయి. ఇవి ఇంజిన్ కోచ్‌లు. రెండు కోచ్‌లు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌ కేటగిరికి చెందినవి కాగా.. మిగిలినవన్నీ ఏసీ చైర్‌కార్‌కు చెందినవి. రైల్వే అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం వందేభారత్ రైలు కొన్ని రూట్లలో ఫుల్‌గా నడుస్తోంది. కానీ, కొన్ని రూట్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నది. అందుకే అలాంటి మార్గాల్లో మినీ రైల్లను రూపొందించే యోచనలో ఉన్నది. తక్కువ కోచ్‌లు ఉండడంతో ప్రయాణికులతో రైలు నిండుగా కనిపిస్తుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జోధ్‌పూర్ నుంచి సబర్మతి వరకు మినీ వందే భారత్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

మినీ వందే భారత్ వేగం ఎంత ఉంటుందంటే..?

ప్రస్తుతం వందే భారత్ జోధ్‌పూర్ నుంచి సబర్మతి సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడవగలిగే సామర్థ్యం ఉంది. రెండు కోచ్‌ల మధ్యలో వెస్టిబ్యూల్స్ ఉన్నాయి. ఇది శబ్దాన్ని అదుపులో ఉంచుతుంది. ప్యాంట్రీ నుంచి ఫుడ్‌ను సైతం సరఫరా చేస్తారు. రైలు ముందు భాగం ఏరోడైనమిక్ ఆకారంలో ఉంటుంది, ఇది అధిక వేగాన్ని తట్టుకునేలా డిజైన్‌ చేశారు.