UP Leopard Hoax : కాలనీలోకి ఏఐ చిరుత ..చివరికి జైలు పాలు
ఏఐతో చిరుత ఫోటో సృష్టించి వైరల్ చేసిన యువకుడు జైలు పాలు.. సరదా కోసం చేసిన పని శిక్షకు దారి తీసింది!
విధాత : ఓ యువకుడు సరదా కోసం చేసిన పని అతడిని జైలు పాలు చేసింది. తమ నివాసిత కాలనీలోకి చిరుత వచ్చిందంటూ సృష్టించిన ఫేక్ ఫోటోలు అతడిని కటకటాల పాలు చేశాయి. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. తమ కాలనీలో చిరుతపులి వచ్చినట్టు.. ఏఐ ద్వారా ఓ యువకుడు ఫోటో ఎడిట్ చేశాడు. దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలనీ వాసులు భయాందోళనలకి గురయ్యారు. ఇది నిజమే అనుకొని.. చిరుతని పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులూ రంగంలోకి దిగారు. చివరికి కాలనిలో చిరుత పులి వ్యవహారం అంతా ఫేక్ అని.. అది ఏఐ ప్రాంక్ అని తెలిసి..అధికారులు, స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఫేక్ చిరుత పులి ఫోటోతో అందరిని భయబ్రాంతులకు గురి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ..సరదా కోసమైనా ఇతరులను ఇబ్బంది పెట్టినందుకు అతనిపై అధికారులు చర్యలు తీసుకున్నారని.. ఓ రకంగా టెక్నాలాజీని, ముఖ్యంగా ఏఐని దుర్వినియోగం చేసినందుకు అతను ఫలితం అనుభవించాడని కామెంట్లు పెట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram