వేగంగా వెళ్తున్న ట్ర‌క్కు.. డ్రైవ‌ర్ క్యాబిన్‌లోకి దూసుకొచ్చిన కొండ‌చిలువ‌

  • Publish Date - October 8, 2023 / 05:17 AM IST

విధాత‌: స‌రీసృపాల‌ను చూడ‌గానే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. మ‌రి అలాంటి భ‌యంక‌ర‌మైన ఓ స‌రీసృపం ఏకంగా డ్రైవ‌ర్ క్యాబిన్‌లోకి దూసుకొచ్చింది. అదేదో ట్ర‌క్కు ఆగి ఉన్న‌ప్పుడు కాదు.. వేగంగా వెళ్తున్న స‌మ‌యంలో. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


దాదాపు 8 అడుగుల పొడ‌వున్న ఓ భారీ కొండ చిలువ‌.. ట్ర‌క్కు ఆగి ఉన్న స‌మ‌యంలో వెనుక భాగంలోకి దూరింది. ఇక ట్ర‌క్కు వేగంగా దూసుకెళ్తున్న స‌మ‌యంలో వెనుక భాగం నుంచి డ్రైవ‌ర్ క్యాబిన్‌లోకి దూసుకొచ్చింది. కొండ‌చిలువ‌ను చూసి డ్రైవ‌ర్ షాక్ అయ్యాడు. వెంట‌నే ట్ర‌క్కును ఆపేశాడు. పోలీసుల‌కు స‌మాచారం అందించాడు.


ట‌క్కు వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. కొండ‌చిలువ‌ను తాళ్ల‌తో బంధించి, గోనె సంచిలో వేశారు. అనంత‌రం దాన్ని అట‌వీ అధికారుల‌కు అప్ప‌జెప్పారు. అయితే కొండ‌చిలువ‌ను గోనె సంచిలో వేసేందుకు య‌త్నిస్తుండ‌గా, అది బైక్‌లోకి దూరేందుకు య‌త్నించి, హంగామా సృష్టించింది. ఈ ఘ‌ట‌న గ్రేట‌ర్ నోయిడా ప‌రిధిలోని పారీ చౌక్‌లో గ‌త వారం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం వీడియో ట్రెండ్ అవుతోంది.