Site icon vidhaatha

ఒడిశా సీఎం ఆస్తులు రూ. 71 కోట్లు.. ఆయ‌న కారు విలువ రూ. 6,434..!

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఆస్తులు రూ. 71.07 కోట్లు అని తేలింది. ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌లో సీఎం త‌న ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. హింజిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ట్నాయ‌క్ పోటీ చేస్తున్నారు. 2109లో ఆయ‌న ఆస్తుల విలువ రూ. 63.87 కోట్లు కాగా, ఈ ఐదేండ్ల‌లో రూ. 7 కోట్లు పెరిగాయి.

ఆరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆయ‌న 64 పేజీల అఫిడ‌విట్‌ను స‌మ‌ర్పించారు. రూ. 14.05 కోట్ల విలువ చేసే చ‌రాస్తులు, రూ. 57.02 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు క‌లిగి ఉన్న‌ట్లు పేర్కొన్నారు. భువ‌నేశ్వ‌ర్‌లో రూ. 13.66 కోట్ల విలువ చేసే న‌వీన్ నివాస్, రూ. 43.35 కోట్ల విలువ చేసే భ‌వ‌నం ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ క‌లాం రోడ్డులో ఉన్న‌ట్లు న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు.

45.77 గ్రాముల డైమండ్లు, రూ. 4.17 ల‌క్ష‌ల విలువ చేసే వెండి ఆభ‌ర‌ణాలు ఉన్న‌ట్లు తెలిపారు. 1980 మోడ‌ల్‌కు చెందిన అంబాసిడ‌ర్ కారు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దీని విలువ రూ. 6,434 అని స్ప‌ష్టం చేశారు. ఐదేండ్ల క్రితం దీని విలువ రూ. 8,905. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌పై ఎలాంటి క్రిమిన‌ల్ కేసులు న‌మోదు కాలేదు. అప్పుల్లేని ముఖ్య‌మంత్రి కూడా ఆయ‌నే.

Exit mobile version