3 BHK Flat | మెట్రో నగరాల్లో( Metro Cities ) అద్దె ఇండ్లకు( Rent Houses ) భలే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు నివసిస్తుంటారు. వీరందరికీ సొంత ఇండ్లు ఉండవు కాబట్టి.. అద్దె ఇండ్లపైనే ఆధారపడుతుంటారు. దీంతో ఇంటి యజమానులు.. డిమాండ్‌కు అనుగుణంగా ఇంటి కిరాయిలను నిర్ణయిస్తుంటారు. అయితే ఓ ఇంటి అద్దె చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 3 BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ. 2.7 లక్షలుగా నిర్ణయించడంతో.. ఆ ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది.
బెంగళూరు నగరం( Bengaluru City )లోని హరలూరు( Haralur ) ప్రాంతం అది. ఓ అపార్ట్‌మెంట్‌లోని 3 BHK ఫ్లాట్ అది. 1,464 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఇంటి అద్దెను నెలకు రూ. 2.7 లక్షలుగా నిర్ణయించారు. ఇక సెక్యూరిటీ డిపాజిట్( Security Deposit ) కింద రూ. 15 లక్షలు జమ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక 3 BHK అద్దె గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడ్డిట్( Reddit )లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. ఈ ప్రకటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒక సామాన్య ఉద్యోగి చెల్లించే అద్దెనా..? అసలేం జరుగుతుంది..? నేను ఏదైనా మిస్ అవుతున్నానా..? లేదా బెంగళూరు నగరంలో చెత్త అపార్ట్‌మెంట్‌ల కోసం ప్రజలు ఇంత డబ్బు చెల్లించడం ప్రారంభించారా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
హరలూరు ఏరియాలో అంత అద్దెలు ఎవరూ చెల్లించడం లేదు.. 3 BHK ఫ్లాట్లు రూ. 50 వేలకే అందుబాటులో ఉన్నాయని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇది ఏజెంట్ల పని అని.. ఈ స్థాయిలో కిరాయిలు లేవని మరో యూజర్ తెలిపాడు. ఇది నిజం కాకపోవచ్చు.. హరలూరు ఏరియాలో సాధారణంగా అద్దెలు చాలా తక్కువగా ఉంటాయని మరొకరు పేర్కొన్నారు.
2.7L rent for a 3bhk in Haralur?
byu/anotherimbaud inindianrealestate