వర్షాల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన టమాటా ధరలు !

దేశంలో మరోసారి టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాలలో వర్షాలు పడుతుండటంతో టమాటా సహా కూరగాయల తోటలు దెబ్బతింటుండం..దిగుబడి, రవాణా సమస్యల నేపథ్యంలో టమాటా సహా కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి.

దేశంలో మరోసారి టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాలలో వర్షాలు పడుతుండటంతో టమాటా సహా కూరగాయల తోటలు దెబ్బతింటుండం..దిగుబడి, రవాణా సమస్యల నేపథ్యంలో టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల నుంచి బెంగళూరు సహా చుట్టుపక్కల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలు వానలు పడుతుండటంతో టమాటా దిగుబడులపై ఎఫెక్ట్ పడుతుంది. టమాటా సహా కూరగాయల పంటలు దెబ్బతింటూ దిగుబడులు పడిపోతున్నాయి. వానాల కారణంగా ఆకు కూరలు, బజ్జి మిరప, దోస, అనప, కాకర, టమాటా, కొత్తిమీర ధరలు పెరిగాయి. అటు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడా పెరిగాయి.

ఈ నేపథ్యంలో బెంగళూరులో టమాటా ధర కేజీ రూ.60 పలుకుతోంది. హైదరాబాద్ వచ్చే టమాటాలలో బెంగుళూరు టమాటా కూడా కీలకం కావడంతో క్రమంగా స్థానిక మార్కెట్ లలోనూ టమాటా ధరలకు రెక్కలు వస్తున్నాయి. వానలు మరింత ముదిరితే టమాటా దిగుబడులు పడిపోయి ధరలు మరింత పెరుగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చిక్కుడు రూ.120, బీరకాయ రూ.105, బెండకాయ రూ.85, పచ్చిమిర్చి రూ.70, వంకాయ రూ.75, గోకర రూ.75, చామగడ్డ రూ.75, దొండకాయ రూ.60, క్యాబేజీ రూ.65, కీర రూ.60, టమాట రూ.54, దోసకాయ రూ.55కి కాస్తా అటుఇటుగా విక్రయిస్తున్నట్లుగా సమాచారం.

Latest News