Revanth Reddy : తుపాన్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్, వరంగల్, హన్మకొండలలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నష్టాన్ని పరిశీలించారు. తుపాను వల్ల సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా.

Revanth Reddy : తుపాన్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్, వరంగల్, హన్మకొండలలో మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏరియల్‌ సర్వే ద్వారా తుపాన్ తో దెబ్బతిన్న ప్రాంతాలను రేవంత్ రెడ్డి వీక్షించారు. అనంతరం రేవంత్ రెడ్డి హన్మకొండ, వరంగల్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు హన్మకొండ చేరుకున్నారు. హన్మకొండ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం, మంత్రులు పరిశీలిస్తున్నారు. గోపులాపూర్, సమ్మయ్య నగర్, హనుమకొండ చౌరస్తా, కాపువాడ, భద్రకాళి ఆలయం మీదుగా రేవంత్ రెడ్డి తుపాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అక్కడక్కడ స్థానికులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్ లో రేవంత్ రెడ్డి తుపాన్ నష్టాలపై అధికారులతో సమీక్ష చేస్తారు.

తెలంగాణలో నాలుగు జిల్లాలపై మొంథా తపాన్ భారీగా ప్రభావం చూపించింది. వరద ప్రభావం నుంచి హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పలు కాలనీల్లో ఇంకా నీరు నిలిచిపోగా, బురద పేరుకుపోయింది. వస్తువులు, సరుకులు నీట మునగడంతో కట్టుబట్టలతో పలు కాలనీవాసులు నిరాశ్రయులయ్యారు. మొంథా తుపాన్ దెబ్బకు సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. పంట నష్టంపై వ్యవసాయ శాఖ త్వరలో పూర్తిస్థాయి నివేదిక అందించనుంది.