• Telugu News
  • /National

90 Yr Old Woman Sells Bracelets : 90 ఏళ్ల వయసులోనూ.. లోకల్‌ ట్రైన్‌లో బ్రేస్‌లెట్స్‌ అమ్ముతున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా

90 ఏళ్ల వయసులోనూ ముంబై లోకల్ ట్రైన్‌లో చేతితో చేసిన బ్రేస్‌లెట్స్‌ అమ్ముతూ జీవన పోరాటానికి ప్రతీకగా నిలిచిన బామ్మ కథ నెటిజన్లను కదిలిస్తోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 05, 2026, 7:51 pm IST
Read Time: 4 mins
90 Yr Old Woman Sells Bracelets : 90 ఏళ్ల వయసులోనూ.. లోకల్‌ ట్రైన్‌లో బ్రేస్‌లెట్స్‌ అమ్ముతున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా

ఓ వయసు వచ్చాకా.. పని చేయాలంటే శరీరం సహకరించదు. ముఖ్యంగా 70 దాటిందంటే చాలు ఇక విశ్రాంతి తీసుకుందాంలే అని అనిపిస్తుంటుంది. మనవళ్లు, మనవరాళ్లతో వృద్ధాప్యాన్ని సంతోషంగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు చాలా మంది. కానీ ఓ వృద్ధురాలు మాత్రం 90 ఏళ్ల వయసులోనూ తనకు చేతనైనపనిచేస్తూ కుటుంబానికి తనవంతు ఆసరాగా నిలుస్తోంది. ప్రస్తుతం యువకులే పనిచేసేందుకు తప్పించుకునే ఈ కాలంలో ఈ బామ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ముంబైకి చెందిన 89 ఏళ్ల కమలాబెన్‌ మెహతా అనే బామ్మ లోకల్‌ ట్రైన్‌లో బ్రేస్‌లెట్స్‌ అమ్ముతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వయసు కేవలం శరీరానికే గానీ, మనసుకు, ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపిస్తోంది. లోకల్‌ ట్రైన్స్‌ (Mumbai local trains) నిత్యం రద్దీగా ఉంటాయి. వయసులో ఉన్న వాళ్లే బ్యాలెన్స్‌ చెయ్యడం కష్టం. అలాంటిది ఆ రైల్లో ఈ వయసులోకూడా బామ్మ ఎంతో ఉత్సాహంగా బ్రేస్‌లెట్స్‌ అమ్ముతూ కనిపించింది. సొంతంగా చేతితో తయారు చేసిన బ్రేస్‌లెట్స్‌ను (handmade bracelets) అమ్ముతోంది. ఈ బామ్మను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వయసులో ఎందుకింత కష్టం అంటూ ఆమెను పలకరిస్తున్నారు. అయితే, పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడాని భావోద్వేగానికి గురైంది. అప్పటి నుంచి కుటుంబానికి భారం కాకుండా ఏదో ఒకపనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు వివరించింది. ఇనిరోజులూ తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబానికి ఎంతో కొంత సాయంగా ఉండాలనే ఇలా తెలిసిన పనిని ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణిస్తూ వస్తువులను అమ్ముతున్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు బామ్మ సంకల్పానికి ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు సూపర్‌ బామ్మ’’ అంటూ మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

One Nation One Election | దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలేంటి?
TDR Policy Crisis | తెలంగాణలో బిల్డర్ల నెత్తిన టీడీఆర్ బాంబు.. అంతిమంగా కొనుగోలుదారునికే దెబ్బ!