Site icon vidhaatha

Ved Lahoti | సోష‌ల్ మీడియా వ‌ల్ల స‌మ‌యం వృధా : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాప‌ర్‌

Ved Lahoti | న్యూఢిల్లీ : నిన్న ప్ర‌క‌టించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాల్లో రాజ‌స్థాన్‌కు చెందిన వేద్ లాహోటి టాప‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. 360 మార్కుల‌కు గానూ 355 మార్కులు సాధించి ఆలిండియా టాప‌ర్‌గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా వేద్ లాహోటి మాట్లాడుతూ.. తాను స‌మ‌యం వృధా చేయ‌కుండా చ‌ద‌వ‌డం వ‌ల్లే ఈ ర్యాంకు సాధ్య‌మైంది. చ‌దువుతున్న‌ప్పుడు ఒక్క‌సారి కూడా గ‌డియారాన్ని చూడ‌లేదు. సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉన్నాను. దాని వ‌ల్ల స‌మ‌యం వృధా అవుతుందే త‌ప్ప ఎలాంటి లాభం లేద‌ని చెప్పి.. పూర్తి స్థాయిలో చ‌దువుపైనే ఏకాగ్ర‌త పెట్టాను. జేఈఈకి ప్రిపేర‌య్యే వారు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో ట‌చ్‌లో ఉండాల‌ని, టీచ‌ర్ల స‌హాయంతో చ‌దువుకోవాల‌ని వేద్ లాహోటి సూచించారు.

ఈ సారి జేఈఈ మెయిన్‌లో క‌నీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.50 ల‌క్ష‌ల మందిలో 1,80,200 మంది అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష రాశారు. రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం క‌టాఫ్ మార్కుల ఆధారంగా జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు 48,248 మందికి అర్హ‌త క‌ల్పించారు. ఇందులో 40,284 మంది అబ్బాయిలు, 7,964 మంది అమ్మాయిలు ఉన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇత‌ర కేంద్ర విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశానికి సంయుక్తంగా నిర్వ‌హించే జోసా కౌన్సెలింగ్ ప్ర‌క్రియ నేటి నుంచి మొద‌ల‌వుతుంది.

Exit mobile version