Cooking during Menstruation | ముంబై : యుక్త వయసు వచ్చిన ప్రతి మహిళ( Woman )కు నెలసరి( Menstruation ) రావడం సహజం. హార్మోన్ల( Hormones ) ప్రభావం కారణంగా రుతుక్రమం( Menstruation ) వస్తుంది. అయితే చాలా కుటుంబాల్లో ఈ నెలసరిని అపవ్రితంగా భావిస్తారు. ఇక ఆ సమయంలో నెలసరి వచ్చిన మహిళను ఎంతో హీనంగా చూస్తారు. వంటింట్లోకి( Kitchen ) అడుగుపెట్టనివ్వరు. దేవుడిని తాకనివ్వరు. కనీసం ఆమెకు గౌరవ మర్యాదలు కూడా లభించవు. ఆ మాదిరిగానే ఓ అత్త( Mother in Law ) తన కోడలి( Daughter in Law ) పట్ల రాక్షసంగా ప్రవర్తించింది. నెలసరి వచ్చినప్పుడు వంట చేసిందని అత్త వేధించడంతో కోడలు ఆత్మహత్య( Suicide ) చేసుకుంది.
మహారాష్ట్ర( Maharashtra )లోని జల్గావ్‌కు చెందిన గాయత్రి కోలి( Gayatri Koli )(26) కి కొన్నేండ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి గాయత్రికి వరకట్నం( Dowry ) వేధింపులు అధికమయ్యాయి. తరుచూ అత్తమామలు, ఆడపడుచులు, భర్త వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవలే కోడలికి నెలసరి వచ్చింది. ఆ సమయంలో ఆమె వంటింట్లోకి అడుగుపెట్టి వంట చేసింది.
ఇదే అదునుగా భావించిన అత్త, ఆడపడుచు.. గాయత్రి పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. రుతుక్రమం వచ్చినప్పుడు వంట ఎలా చేస్తావ్ అంటూ అనాగరికంగా ప్రవర్తిస్తూ.. గాయత్రిని వేధింపులకు గురిచేశారు. శారీరకంగా హింసించారు. తీవ్రంగా కొట్టారు. అత్త, ఆడపడుచు వేధింపులు భరించలేని గాయత్రి గత గురువారం చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, అత్త, ఆడపడుచు కలిసి హత్య చేశారని గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత గాయత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని పేర్కొన్నారు. గాయత్రి భర్తతో పాటు అత్త, ఆడపడుచును కఠినంగా శిక్షించాలని, అప్పటి వరకు అంతిమ సంస్కారాలు నిర్వహించమని మృతురాలి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.