విధాత: కుర్రకారులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల తరుచూ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. అయినా అప్పుడప్పుడు ప్రకృతిలో సేద తిరుతూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. అంతేగాక తన వర్కౌట్ వీడియోలు పోస్టు చేస్తూ యూత్లో సెగలు రేపుతోంది.
అయితే తనకు ఒక మేజర్ సర్జరీ జరిగిందని, నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నానని, గత సంవత్సరమంతా అనారోగ్యంతో పోరాడుతూనే ఉన్నట్టు తన తాజా పోస్టులో తెలిపింది. హార్మోన్ అసమతుల్యతతో బాగా బరువు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించింది.
అయితే ఓ నటిగా ఇలాంటి విషయాలను బహిరంగంగా చెబితే తనలా బాధ పడే వారికి కచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా అని పేర్కొంది. ఇటీవలే తిరిగి మళ్లీ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేశానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపింది.