ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఆదేశం
విధాత, నల్లగొండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం నాగార్జునసాగర్ లో పర్యటించారు. సాగర్ ప్రాజెక్టు మెయిన్ పవర్ హౌజ్ ను పరిశీలించారు. జెన్ కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవర్ హౌజ్ వివరాలను భట్టికి వెల్లడించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలోనూ.. అన్ని యూనిట్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు ఉత్పత్తి జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి తో పాటు. ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జెన్ కో సీఈ, ఎస్ఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.