Site icon vidhaatha

Neck: మెడపై చర్మం ముడతలు పడకుండా ఉండాలా.. అయితే ఇలా చేయండి

Neck:

మెడపై ముడతలు పడటం సాధారణమైన విషయం. అయితే ఇటీవల అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మెడపై ముడతలు తగ్గించుకుని, తాజాగా ఉంచుకోవాలంటే ఇలా చేయండి.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి: చర్మం సాగడానికి, ముడతలు రాకుండా ఉండటానికి నీరు చాలా అవసరం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం కూడా మంచిది.

సన్‌స్క్రీన్ వాడండి: సూర్యకిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి, దీనివల్ల ముడతలు వస్తాయి. మెడకు కూడా సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లే 30 నిమిషాల ముందు రాసుకోవాలి.

క్రీమ్స్, సీరమ్స్: రెటినోల్, విటమిన్ సి, పెప్టైడ్స్ వంటి పదార్థాలు కలిగిన క్రీమ్స్ ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని రాత్రిపూట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

‘టెక్ నెక్’ను నివారించండి: సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడటం వల్ల మెడ ముందుకు వంగి ముడతలు వస్తాయి. స్క్రీన్ చూసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. మెడను వెనక్కి, పక్కలకు తిప్పడం వల్ల కండరాలు సాగుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, నట్స్, బెర్రీలు, చేపలు చర్మానికి చాలా మంచివి.

మెడ వ్యాయామాలు: కొన్ని సులభమైన వ్యాయామాలు మెడ కండరాలను బలపరుస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముడతలు రాకుండా చేస్తాయి. ఉదాహరణకు, మెడను ముందుకు, వెనక్కి, పక్కలకు తిప్పడం, భుజాలను పైకి కిందకు కదిలించడం వంటివి చేయవచ్చు.

సరైన నిద్ర: నిద్ర సరిగా లేకపోతే చర్మం తొందరగా ముడతలు పడుతుంది. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.

ధూమపానం మానుకోండి: ధూమపానం చర్మానికి రక్త ప్రసరణను తగ్గిస్తుంది, దీనివల్ల ముడతలు వస్తాయి.

చర్మ సంరక్షణ: మెడను శుభ్రంగా ఉంచుకోవడం, క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి.

Exit mobile version