ఆ బాపు విజయం సాధించాడు

సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ గ్రామ పంచాయతీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామ చంద్రారెడ్డి బరిలో నిలిచారు.

విధాత: సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ గ్రామ పంచాయతీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామ చంద్రారెడ్డి బరిలో నిలిచారు. ఊరంతా తన కుటుంబంలా భావించే బాపుకు, ఊరు బాగును తన బాధ్యతగా భావించే బాపుకు, ఊరుమ్మడిగా జన ఘన నీరాజనం పలికారు. తొంభై ఐదు ఏళ్ల పోరాట స్ఫూర్తికి ప్రజా ప్రభంజనం జైకొట్టింది. నాగారం గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉండగా 9 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

నాగారం గ్రామ పంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉండగా 2448 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1185, స్త్రీలు 1262, ఒక ట్రాన్స్‌ జెండర్ ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. రామ చంద్రారెడ్డిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహాలనే రచించింది. అయినా గ్రామస్తులు మాత్రం రామ చంద్రారెడ్డినే 136 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

Latest News