Site icon vidhaatha

హిమాచల్ ప్రదేశ్‌లో హై అలర్ట్

విధాత: జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ అమలవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో హిమాచల్ ప్రదేశ్ లోనూ టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో హిమాచల్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖకు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆదేశించారు.

ముఖ్యంగా కశ్మీర్ సహా పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని చంబా, కాంగ్రా జిల్లాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేశారు.టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారని.. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతున్న నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.

Exit mobile version