Site icon vidhaatha

షాకింగ్ న్యూస్‌: తెలంగాణలో.. కింగ్ ఫిషర్ బీర్లు బంద్

విధాత‌: ముందు ప్రియులకు నిజంగా ఇది చేదు వార్త.. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు దొరికే అవకాశం లేదు. కేవలం స్టాక్ ఉన్నంత వరకే ఈ బీర్లు దొరికే అవకాశం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ బివరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ 2019 నుంచి ధరలు పెంచడానికి అవకాశం ఇవ్వలేదని అందుకే తాము తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపి వేస్తున్నట్లు యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ (యుబి) తెలిపింది.

ఈ మేరకు యుబీ కంపెనీ 2025 జనవరి 8 వ తేదీన ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం ఇస్తూ లేఖ రాసింది. దీంతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించలేదని తెలిపింది. యుబీ కంపెనీకి తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ దాదాపు రూ.900 కోట్ల బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మందు ప్రియులు అమితంగా ప్రేమించి తాగే కింగ్ ఫిషర్ బీర్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం వస్తోంది. అంత ఆదాయం వచ్చినప్పటికీ ఎందుకు బకాయిలు చెల్లించడంలేదని మందుప్రియులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పైగా పెరిగిన ముడిసరుకుల ధరలకు అనుగుణంగా బీర్ల ధరలు కూడా పెంచక పోవడంతో తయారీలో తీవ్ర నష్టం వస్తున్నందున ఈ మేరకు సరఫరా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు యుబీ కంపెనీ ఆ లేఖ లో తెలిపింది.

Exit mobile version