Telangana | తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మ‌కాలు.. మే నెల‌లో రూ. 3,285 కోట్ల ఆదాయం

Telangana | తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. ఒక్క మే నెల‌లోనే 7.44 కోట్ల బీర్ల అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఎండ‌లు ఉక్కిరిబిక్కిరి చేయ‌డం, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని అధికారులు సేర్కొన్నారు. అయితే 2019 మే నెల‌లో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్ల అమ్మ‌కాలు జ‌ర‌గ్గా, తాజాగా ఆ రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ.. ఈ ఏడాది మే నెల‌లో 7.44 కోట్ల బీర్ల‌ను […]

  • Publish Date - June 2, 2023 / 02:59 AM IST

Telangana | తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. ఒక్క మే నెల‌లోనే 7.44 కోట్ల బీర్ల అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఎండ‌లు ఉక్కిరిబిక్కిరి చేయ‌డం, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని అధికారులు సేర్కొన్నారు. అయితే 2019 మే నెల‌లో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్ల అమ్మ‌కాలు జ‌ర‌గ్గా, తాజాగా ఆ రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ.. ఈ ఏడాది మే నెల‌లో 7.44 కోట్ల బీర్ల‌ను మ‌ద్యం ప్రియులు సేవించ‌డం విశేషం.

బుధ‌వారం ఒక్క రోజే రూ. 300 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు..

మే నెలలో రూ.3,285 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా అందులో బుధవారం ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మే నెలలో అత్యధికంగా 64,48,469 లక్షల కేసుల బీర్ల అమ్మకాలతో పాటు 30,66,167 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

బుధవారం (మే, 31వ తేదీ) ఒక్కరోజే 2,55,526 లక్షల కేసుల బీర్లు, 3,31,961 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు వివ‌రించారు. గత సంవత్సరం 2022 మే నెలలో 55,72,000 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా, 27,11,000 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు తెలిపాయి.

తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 కోట్లు విలువైన మద్యం విక్రయం జరుగుతోంది. 2022-,23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Latest News