అత్త అందానికి అల్లుడి ఫిదా..ఆమెతోనే పెళ్లి!

ప్రేమ పిచ్చిది గుడ్దిదే కాదు.. ప్రేమకు వయసుతో పనిలేదని, బంధుత్వాలతో అస్సలే సంబంధం లేదని అనుకున్నారో ఏమో ఓ అత్త, అల్లుడు తమ ముదురు ప్రేమతో పెళ్లిపీటలెక్కేశారు.

విధాత :  ప్రేమ పిచ్చిది గుడ్దిదే కాదు.. ప్రేమకు వయసుతో పనిలేదని, బంధుత్వాలతో అస్సలే సంబంధం లేదని అనుకున్నారో ఏమో ఓ అత్త, అల్లుడు తమ ముదురు ప్రేమతో పెళ్లిపీటలెక్కేశారు. యూపీలోని కాన్పూర్ దేహాత్ అక్బర్పూర్ పరిధిలో ఓ అల్లుడు తనకు పిల్లనిచ్చిన అత్త అందానికి ముగ్ధుడై ఆమెనే పెళ్లాడిన విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. లోకం ఏమనుకున్నా పర్వాలేదనుకుంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ కోర్టు సర్టిఫికేట్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో అది కాస్తా వైరల్ గా మారింది. తమ బంధాన్ని సమాజం అంగీకరించి, ఆశీర్వదించాలని ఆ జంట కోరుతోంది.

వీరి వ్యవహారం కామాతురానం నభయం న లజ్జ అన్నట్లుగా ఉందంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. యూపీలో ఇలాంటి విచిత్ర పెళ్లిళ్లు ఇటీవలి కాలంలో పెరిగిపోవడం మానవ,సామాజిక సంబంధాలలో వస్తున్న ఆందోళనకర మార్పులను నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 

Latest News