OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. స్ట్రీమింగ్‌కు రెడీ అయిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
OTT Movies | ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. థియేటర్లలో సందడి చేసిన పలు హిట్ సినిమాలు, కొత్త ఒరిజినల్ మూవీస్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
OTT Movies | ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. థియేటర్లలో సందడి చేసిన పలు హిట్ సినిమాలు, కొత్త ఒరిజినల్ మూవీస్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు వివిధ ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో భారీ విజయాలు సాధించిన రెండు తెలుగు సినిమాలు ఈ వారం ఓటీటీలోకి రావడం సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు
సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి ఆదరణ పొందిన కొన్ని చిత్రాలు ఇప్పటికే ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉన్నాయి. శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
‘ది రాజా సాబ్’ – జియో హాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు హిట్ సినిమాలు
ఈ వారం రెండు భారీ తెలుగు చిత్రాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
‘మన శంకర వరప్రసాద్ గారు’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. రూ.375 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
‘అనగనగా ఒక రాజు’
నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.
నేరుగా ఓటీటీలో విడుదల
‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ అనే ఒరిజినల్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. లయ – శివాజీ మళ్లీ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్ లో ప్రీమియర్ కానుంది.
మలయాళ సినిమాల సందడి
ఈ వారం మలయాళ చిత్రాలు కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి.
‘బేబీ గర్ల్’ – మెడికల్ థ్రిల్లర్, ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్.
నివిన్ పౌలి నటించిన ‘సర్వం మాయా’ – జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
సౌబీన్ షాహీర్ నటించిన ‘పాతి రాత్రి’ – ఫిబ్రవరి 13 నుంచి సోనీ లివ్‌లో తెలుగు, తమిళ్, హిందీతో పాటు మలయాళంలో విడుదల.
‘నీలకంఠ’ – సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్.
హాలీవుడ్ సినిమాలు – వెబ్ సిరీస్‌లు
హాలీవుడ్ అభిమానుల కోసం కూడా ఆసక్తికరమైన కంటెంట్ సిద్ధంగా ఉంది.
హారర్ థ్రిల్లర్ ‘ది కంజూరింగ్: లాస్ట్ నైట్స్’ – ఫిబ్రవరి 13 నుంచి జియో హాట్‌స్టార్.
ఇటాలియన్ డ్రామా సిరీస్ ‘మోటార్ వ్యాలీ’ – ఫిబ్రవరి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
మొత్తానికి ఈ వారం ఓటీటీలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్స్, థ్రిల్లర్స్, హారర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులకు ఇది నిజంగా వినోదాల విందు అని చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram