Site icon vidhaatha

Phone tapping Case | అప్పటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ : సిట్‌కు ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌?

Phone tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సిట్ విచారణలో పోలీస్ బుర్రను ఉపయోగిస్తూ తెలివిగా చెతుతున్న సమాధానాలు దర్యాప్తు అధికారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ట్యాపింగ్ ఎందుకు చేశారు.. ఎవరు చేయమన్నారు.. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్నదానిపై ఆదేశాలు ఎవరిచ్చారు? అన్న ప్రశ్నలకు ప్రభాకర్ రావు పొంతనలేని సమాధానాలిచ్చారని తెలిసింది. అప్పటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశానని అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్లుగా సమాచారం. అంతేగాక ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదంటూ ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాలకుల ప్రమేయం లేదన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తున్నది. తన పైఅధికారి అయిన డీజీపీ చెప్తేనే అన్నీ చేశానని సిట్‌కు వెల్లడించినట్టు సమాచారం. చాలా వరకు తెలియదు.. గుర్తులేదనే సమాధానాలను ప్రభాకర్‌ రావు చెప్తున్నారని సిట్ అధికారులు తెలిపారు. అరెస్టు నుంచి మినహాయింపు పొందిన ప్రభాకర్ రావు.. దానికి విరుద్దంగా విచారణకు సహకరించకపోవడంతో సిట్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అరెస్టు రిలీఫ్ ఆర్డర్ రద్దుకు పిటిషన్ వేసి..ప్రభాకర్ రావును కస్టోడియన్ విచారణ చేసేందుకు చట్టపరంగా కసరత్తు చేస్తుంది.

Exit mobile version