Site icon vidhaatha

Rallis: 2025 ఆర్థిక సంవత్సరం.. రల్లీస్ రూ.2,633 కోట్ల ఆదాయం

Rallis:

హైదరాబాద్: రల్లీస్ (Rallis) ఇండియా లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.2,663 కోట్ల ఆదాయం, రూ.125 కోట్ల నికర లాభం సాధించింది. నాలుగో త్రైమాసికంలో రూ.430 కోట్ల ఆదాయం నమోదైంది, దేశీయ వ్యాపారంలో సానుకూల వాల్యూమ్ వృద్ధి కనిపించింది. వర్కింగ్ క్యాపిటల్ నియంత్రణ ద్వారా బలమైన నగదు ప్రవాహం సాధ్యమైంది. మట్టి, మొక్కల ఆరోగ్య విభాగంలో 23%, హెర్బిసైడ్స్‌లో 24% వృద్ధి సాధించింది. ఇన్నోవేషన్ టర్నోవర్ ఇండెక్స్ 14% లక్ష్యానికి అనుగుణంగా ఉంది. సీడ్స్ వ్యాపారం 18 కోట్ల రూపాయల పీబీటీతో పునరాగమనం చేసింది. ఇది ‘డిగ్గాజ్’ కాటన్ హైబ్రిడ్, ఖర్చు ఆప్టిమైజేషన్‌తో సాధ్యమైంది. దేశీయ వ్యాపారంలో మార్కెట్ వాటాను మెరుగుపరచడం, ఎగుమతులు, సీఎస్‌ఎం వ్యాపారంలో ఉత్పత్తుల విస్తరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తామని సీఈఓ జ్ఞానేంద్ర శుక్లా తెలిపారు. సంస్థ నిర్మాణ సరళీకరణ, కొత్త ప్రతిభ చేర్పించడం ద్వారా సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. రైతుల అవసరాలకు అనుగుణమైన విభిన్న ఉత్పత్తులు, కస్టమర్ కేంద్రీకృత విధానం, మార్కెటింగ్, తయారీ, డిజిటల్ సామర్థ్యాల్లో పెట్టుబడులతో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

నాల్గవ త్రైమాసిక ఫలితాల వివరాలు:

డిజిటల్ ద్వారా కస్టమర్ సంబంధాల బలోపేతం.
24/7, 10 భాషల్లో అందుబాటులో ఉన్న ‘వాట్సాప్ చాట్‌బాట్’ ప్రారంభం (టోల్-ఫ్రీ: 1800-258-2595).

‘లాఫా’ హెర్బిసైడ్ (గ్లూఫోసినేట్ అమ్మోనియం 13.5% ఎస్‌ఎల్) ప్రారంభం.

‘మెటలాక్సిల్-ఎం’ యాక్టివ్ ఇన్‌గ్రిడియంట్ వాణిజ్యీకరణ.

‘ఏజిస్ గ్రాహం బెల్ అవార్డ్’లో ఫైనలిస్ట్‌గా గుర్తింపు.

ఐసీఏఐ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అవార్డ్స్ 2024లో ‘ఎక్సలెన్స్ ఇన్ బీఆర్‌ఎస్‌ఆర్’ అవార్డు.

Exit mobile version