Site icon vidhaatha

Tharun | మెగా అల్లుడిగా త‌రుణ్‌?.. నిజమేనా!

Tharun | టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ పొంది స్టార్ హీరోగా ఎదిగాడు త‌రుణ్‌. ‘అంజలి’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన‌ తరుణ్.. ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న త‌రుణ్ ఆ త‌ర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ వంటి సినిమాలతో వ‌రుస విజ‌యాల‌ని అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.

అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో త‌రుణ్‌ని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి. దీంతో ఆయ‌న సినిమాల‌కి దూర‌మై వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక కొద్ది రోజుల గ్యాప్ త‌ర్వాత ‘ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముంఉద‌కు రాగా, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది.

త‌రుణ్ మళ్లీ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుండ‌గా, అవి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు స‌మాచారం. ఇక త‌రుణ్ పెళ్లి గురించి ఎప్ప‌టి నుండో అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఫ‌లానా వ్య‌క్తితో పెళ్లి అని పుకార్లు పుట్టిస్తుండ‌గా, అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి.

అయితే ఇటీవ‌ల త‌రుణ్ త‌ల్లి రోజా ర‌మ‌ణి త‌న కొడుకు ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా సమాచారం ఇచ్చింది. దీంతో అంద‌రు కూడా మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడ‌ని జోస్యం చెబుతున్నారు. వారు మెగా ఫ్యామిలీనే పాయింట్ ఔట్ చేయడానికి కార‌ణం లేక‌పోలేదు.

ఇండస్ట్రీలో ఉండే బ‌డా ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీ ఒక‌టి. ఈ ఫ్యామిలీలో ఉండే ఇద్దరమ్మాయి లకు పెళ్లిళ్లు జరిగాయి. ఇక అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరనే విష‌యం తెలిసిందే. ద‌గ్గుబాటి ఫ్యామిలీలో వెంకీకి ఇద్ద‌రు కూతుర్లు ఉండ‌గా, ఒక కూతురికి పెళ్లి చేశాడు. మ‌రో కూతురు పెళ్లికి రెడీగా ఉన్నా కూడా ఆమెకి త‌రుణ్‌కి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది.

సో అందుకే ఇప్పుడు అంద‌రి దృష్టి మెగా ఫ్యామిలీపై ప‌డింది. మెగా ఫ్యామిలీలో శ్రీజ‌, నిహారిక ఇప్పుడు సోలోగా ఉండ‌గా వారిద్ద‌రిలో ఒక‌రిని త‌రుణ్ వివాహం చేసుకోనున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని మెగా కాంపౌండ్ తీవ్రంగా ఖండించింది.

Exit mobile version