Site icon vidhaatha

Tarun | మెగా అల్లుడిగా త‌రుణ్‌?… ఎట్ట‌కేల‌కి స్పందించిన హీరో

Tarun | ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల ప్రేమ‌, పెళ్లి, విడాకులకి సంబంధించిన అంశాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ వార్త‌లు నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో అభిమానులు ఒకింత ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు.

అయితే గ‌త కొద్ది రోజులుగా త‌రుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడ‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేయ‌గా, మ‌రో వ‌ర్గం ఆల్రెడీ ఆయ‌న‌కి పెళ్లైందని ప్ర‌చారం చేశారు. దీంతో అభిమానుల‌కి ఏది నిజ‌మో తెలియ‌ రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో త‌రుణ్ స్పందించి త‌న పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చారు.

బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత హీరోగా స‌త్తా చాటాడు త‌రుణ్‌. కెరీర్ మొద‌ట్లో వ‌రుస సినిమాల‌తో స‌త్తా చాటిన త‌రుణ్ ఆ త‌ర్వాత మాత్రం పెద్ద‌గా స‌క్సెస్‌లు అందుకోలేక‌ పోయాడు. దీంతో మెల్ల‌మెల్ల‌గా అత‌నికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. త‌రుణ్ చివరగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన కూడా అది అంతగా మెప్పించలేకపోయింది.

అయితే త‌రుణ్ ఇటీవ‌ల సినిమాల కంటే ఎక్కువగా సీసీఎల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌లో క‌నిపిస్తున్నాడు. మ‌రో వైపు సినిమా ఫంక్ష‌న్స్‌లో సంద‌డి చేస్తున్నాడు. అయితే త‌రుణ్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. మెగా బ్ర‌దర్ నాగ‌బాబు కూతురు నిహారిక‌ని లేదంటే శ్రీజ‌తో ఆయ‌న వివాహం జ‌రుగనుంద‌ని ప్ర‌చారాలు మొద‌లు పెట్టారు.

ఈ వార్తలు దావానంలా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో త‌రుణ్ తప్ప‌క‌ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, పెళ్లి జరిగిందనే వార్తల్లో నిజం ఏ మాత్రం లేదని చెప్పాడు. అస‌లు ఇలాంటి వదంతులు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నాడు.

నా పెళ్లి ఫిక్స్ అయితే తానే ఆ శుభవార్తను నేనే మీ అందరితో పంచుకుంటానని త‌రుణ్ చెప్పాడు. దీంతో గ‌త కొద్ది రోజులుగా జోరుగా సాగుతున్న ప్ర‌చారాలకి పులిస్టాప్ ప‌డ‌నుంది. ఇక త్వ‌రలో త‌రుణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌ల్లి రోజా ర‌మ‌ణి ఓ ఇంట‌ర్యూలో తెలియ‌జేశారు

Exit mobile version