విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం స్పష్టమవ్వడంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాడేపల్లి సీఎం కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 2019-2024వరకు ఉన్న ఏ ఫైల్స్ కూడా బయటకు పోవద్దని అధికారులను హెచ్చరించారు. అటు టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోవడంతో ఏపీ పోలీసులు కాబోయే సీఎం చంద్రబాబుకు భద్రత పెంచేశారు. చంద్రబాబు కోసం వెంటనే అధికారిక కాన్వాయ్ సిద్ధం చేయాలని ఆదేశించారు.ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏక పక్ష విజయం సాధించడంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
చంద్రబాబు కంట్రోల్లోకి ఏపీ సీఎం ఆఫీస్
బాబుకు భద్రత పెంచిన ఏపీ పోలీస్ కాన్వాయ్ సిద్ధం చేయాలని ఆదేశం

Latest News
విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!
ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!
పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్
అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?