మీకు తెలుసా..? సీపీఆర్ మెషిన్స్ వచ్చేశాయ్ !

గుండెపోటు బాధితులను కాపాడేందుకు సీపీఆర్ మెషిన్స్ మార్కెట్లోకి వచ్చాయి. అత్యవసర సమయంలో ప్రాణాలను నిలబెట్టే ఈ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతోంది.

మీకు తెలుసా..? సీపీఆర్ మెషిన్స్ వచ్చేశాయ్ !

విధాత : సైన్స్ అభివృద్ది చెందుతున్న క్రమంలో మానవ ఆరోగ్య పరిరక్షణ విజ్ఞానంలో సైతం ఆధునికంగా అనేక మార్పులు..శస్త్ర చికిత్సలు, స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చే ప్రాణాంతక గుండె పోటు నుంచి బాధితులను కాపాడేందుకు ఇప్పటిదాక అత్యవసరంగా సీపీఆర్(కార్డియో పల్మనరీ రెస్యూసిటేషన్) కోసం మనుషులే స్వయంగా చేతులతో చాతీమీద, గుండె పైన గట్టిగా నొక్కుతూ నిర్వహించడం కొనసాగుతుంది. అయితే తాజాగా మార్కెట్ లోకి సీపీఆర్ మెషిన్స్ కూడా అందుబాటులోకి రావడం వైద్య శాస్త్ర రంగంలో గొప్ప పురోగతిగా పేర్కొంటున్నారు.

ఇటీవల దుబాయ్‌లో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది, ఒక అధునాతన ‘సీపీఆర్ మెషిన్’ను ఉపయోగించి అతనికి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీపీఆర్ అంటే కార్డియో పల్మనరీ రెస్యూసిటేషన్ . మనిషి గుండెపోటుకు గురైనప్పుడు అతడి ప్రాణాలను కాపాడగల ఒక అత్యవసర ప్రక్రియ ఇది . గుండెపోటు అంటే మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయి, మీ శరీరానికి రక్తాన్ని పంప్ చేయలేకపోవడం. సీపీఆర్ ప్రక్రియతో గుండెపోటుకు గురైన వ్యక్తి ఛాతీని నొక్కడం (ఛాతీ మధ్యలో బలంగా, వేగంగా నెట్టడం) ద్వారా కీలక అవయవాలకు కొంత రక్త ప్రసరణ, అక్సిజన్ అందడం జరుగుతుంది. వైద్యులు, నర్సులు, పారామెడిక్‌ల సిబ్బంది ఆకస్మికంగా గుండెపోటుకు గురైన వ్యక్తులకు అత్యవసరంగా ప్రాథమిక చికిత్స సీపీఆర్ తో ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. గుండెపోటు కు గురైన వ్యక్తిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లే లోపు అతని ప్రాణాలను కాపాడటంలో సీపీఆర్ ప్రక్రియ ప్రాణధారంగా పనిచేస్తుంది. సీపీఆర్ లో నోటి ద్వారా శ్వాస అందించడం ద్వారా కూడా బాధితులకు ఆక్సిజన్ అందుతుంది.

ఇవి కూడా చదవండి :

రూ. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
Raghu Kunche | పూరీ జగన్నాథ్ సక్సెస్ వెనుక రహస్యాలు.. ఆర్థిక కష్టాలకు కారణం ఇదే: రఘు కుంచే సంచలన వ్యాఖ్యలు