Volcanoes Eruptions | అగ్ని పర్వతాల బూడిద వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది?

ఎక్కడో ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైతే.. దాని ధూళి ఢిల్లీవైపు ప్రయాణిస్తుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?

volcanic eruptions

Volcanoes Eruptions | అగ్ని పర్వతాలు విస్పోటనం చెంది లావా బయటకు వచ్చిందని మనం తరచుగా మీడియాలో చూస్తాం. ఇండోనేషియా వంటి దేశంలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. భూకంపాలకు, అగ్ని పర్వతాలకు మధ్య ఉన్న దగ్గరి సంబంంధం ఏంటి? అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడుతాయి? అగ్ని పర్వతాల విస్పోటనం ప్రమాదమా? అగ్ని పర్వతాలు బద్దలయ్యే అవకాశం ఉందని ముందే తెలుసుకోవచ్చో తెలుసుకుందాం.

అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడుతాయి?

అగ్నిపర్వతం అంటే గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు. అగ్ని పర్వతాలు, భూకంపాలు రెండు భూమి టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా సంభవిస్తాయి. భూకంపం, అగ్ని పర్వతాలు భూమి కేంద్రం నుంచి విడుదలయ్యే వేడి, శక్తి వల్ల సంభవిస్తాయి. టెక్టోనిక్ ప్లేట్ల తీవ్రమైన కదలిక ద్వారా అగ్ని పర్వత విస్పోటనాలను ప్రేరేపిస్తాయి. అగ్నిపర్వతం లోపల ఉన్న శిలాద్రవం కదలిక ద్వారా భూకంపాలు కూడా వస్తాయి. అందుకే భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనాలకు సంబంధం ఉందని చెబుతారు. భూమి అంతర్జనిత శక్తుల ఏదైనా మార్పు సంభవిస్తే ఉష్ణోగ్రత పెరిగి శిలలు కరుగుతాయి. ఆ శిలాద్రవం కుహరం ద్వారా గానీ ఉపరితలం చేరి చల్లారి ఘనీభవిస్తుంది. దీని వల్ల కొత్త రాతిపొర ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల అగ్ని పర్వతాలు ఏర్పడుతాయి.

అగ్నిపర్వతాల్లో రకాలు?

అగ్ని పర్వతాల విస్పోటన తీవ్రత, క్రియాశీలత ఆధారంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్ని పర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు అని మూడు రకాలుగా విభజించారు. త్వరితగతిన ఉద్భేదనం చెందే అగ్ని పర్వతాలను క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. ఒకసారి విస్పోటనం చెంది చాలాకాలం ఏ విధమైన చలనం లేకుండా ఉండి మళ్లీ విస్పోటనం చెందే అగ్ని పర్వతాలను నిద్రాణ అగ్ని పర్వతాలు అంటారు. విస్పోటనం చెందని అగ్ని పర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలు అని పిలుస్తారు.

అగ్ని పర్వతాలు ఎందుకు విస్పోటనం చెందుతాయి?

అగ్ని పర్వతాలు విస్పోటనం చెందడానికి ప్రధాన కారణం భూమి లోపల ఉండే అధిక పీడనం. భూమి క్రస్ట్ శిలాద్రవం అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఒక బలహీనమైన ప్రాంతం లేదా రంధ్రం గుండా లావా, వాయువులు బూడిద రూపంలో విస్ఫోటనం చెందుతుంది. ఈ పీడనం ఎక్కువగా పెరిగినప్పుడు అది భూమి పగుళ్ల ద్వారా పైకి కదిలి శిలాద్రవాన్ని లేదా లావా ఉపరితలంపైకి నెడుతుంది. ఈ ప్రక్రియలో లావా, బూడిద, వాయువులు బయటకు వస్తాయి. దీన్నే అగ్నిపర్వత విస్పోటనం అంటారు. ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా వేరుపడినప్పుడు భూమి లోపల ఒత్తిడి పెరిగి విస్పోటనాలు సంభవించవచ్చు. అన్ని అగ్నిపర్వతాలు ఒకే విధంగా విస్పోటనం చెందవు. ఇందులో ఎక్కువ భాగం అగ్ని పర్వతంలో నిల్వ ఉన్న శిలాద్రవం కూర్పుతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా అగ్నిపర్వత విస్ఫోటనాలను ఉద్గార లేదా పేలుడుగా వర్గీకరిస్తారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు కరిగిన పదార్థం వాయువును సులభంగా బయటకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. ఈ రకమైన విస్ఫోటనం నుండి వచ్చే లావా మానవ జీవితానికి అరుదుగా ముప్పు కలిగిస్తుంది.

లావా అంటే ఏంటి?

భూమి కేంద్రంలోని తీవ్రమైన అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని శిలలు కరిగి శిలాద్రవంలా మారుతాయి. శిలాద్రవం దాని చుట్టూ ఉన్న ఘన శిల కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. దీని వలన అది పైకి లేచి శిలాద్రవం గదులలో పేరుకుపోతుంది. శిలాద్రవం లిథోస్పియర్ ద్వారా పెరుగుతూనే ఉంటుంది. కొంత కాలం తర్వాత రంధ్రాలు, పగుళ్ల ద్వారా ఇది భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. శిలాద్రవం భూమి ఉపరితలంపైకి విస్ఫోటనం చెందినప్పుడు దానిని లావా అంటారు. ఇది చాలా వేడిగా ఉంటుంది. సుమారు 700 నుంచి 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

సముద్రాల అడుగులోనే

సముద్రం అడుగున ఉండే శిఖరాల వద్ద రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య శిలాద్రవం చల్లబడి ఘనీభవిస్తూ కొత్త శిఖరాలు ఏర్పడుతాయి. దీంతో అవి ఒకదానికొకటి దూరంగా జరుగుతూంటాయి. ఈ శిఖరాల వద్ద పెంకు లేదా క్రస్టు చాలా పల్చగా ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్లు లాగడం వల్ల పీడనం విడుదలవడంతో అడయబాటిక్ వ్యాకోచం జరుగుతుంది. అలాగే మాంటిల్ పాక్షికంగా కరిగి అగ్నిపర్వతం క్రస్టు ఏర్పడుతుంది. విడిపోయే ఫలకల సరిహద్దులు చాలావరకు మహాసముద్రాల దిగువనే ఉన్నాయి. అందువల్ల భూమిపై జరిగే అగ్నిపర్వత కార్యకలాపాలు చాలావరకు సముద్రాల అడుగునే జరుగుతాయి. ఈ క్రమంలో కొత్త సముద్ర గర్భం ఏర్పడుతుంది.సముద్ర శిఖరాలు సముద్ర మట్టానికి పైన ఉన్న చోట్ల అగ్నిపర్వత ద్వీపాలు ఏర్పడతాయి.

వేల కిలోమీటర్లు ప్రయాణించే బూడిద

అగ్నిపర్వత విస్పోటనం జరిగిన సమయంలో వెలువడే లావా పది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగినప్పుడు వెలువడే బూడిద చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది గాలి ప్రవాహాల ద్వారా సుదూరాలకు ప్రయాణిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ బూడిద వందలు, వేల కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించే అవకాశం ఉంది. ఇథోపియోలో అగ్నిపర్వతం విస్పోటనం చెంది వెలువడిన బూడిద ఢిల్లీ వైపు ప్రయాణిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇండియాను అప్రమత్తం చేశారు.
అగ్నిపర్వతాల బూడిద వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి ప్రధాన కారణం బలమైన గాలులు.ఇవి విస్ఫోటనం తర్వాత ఏర్పడే బూడిద మేఘాన్ని చాలా దూరం తీసుకెళ్తాయి. అగ్నిపర్వతం నుండి బూడిద మేఘం చాలా ఎత్తుకు వెళ్ళినప్పుడు, అది వాతావరణంలోని బలమైన గాలుల ప్రవాహంలో భాగమవుతుంది. ఈ గాలులు బూడిద కణాలను చాలా ఎక్కువ దూరం వరకు తీసుకువెళ్లగలవు. గంటలు రోజుల తరబడి వేల కిలోమీటర్లు వరకు ఈ బూడిదను ఈ గాలులు తీసుకెళ్తాయి. ఈ కణాల పరిమాణం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే అవి గాలిలో ఎక్కువ కాలం తేలియాడుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి.

Read Also |

Bollywood | భర్తపై గృహ‌హింస కేసు పెట్టిన బాలీవుడ్ నటి
రాష్ట్రంలో రాజకీయ పండుగ.. పల్లెల్లో నెల రోజులపాటు సందడి!
Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!
Civil Supplies Corporation | పౌర సరఫరాల్లో రిటైర్డ్‌ ఉద్యోగుల తిష్ఠ! ప్రతి నెలా రూ.40 లక్షల దుబారా!

Latest News