Huawei Nova 16 | 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో హువావే మొబైల్స్ లాంచ్.. ఫీచర్లు చూస్తే షాక్!

Huawei Nova 16 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచేందుకు చైనా టెక్ దిగ్గజం హువావే కొత్తగా మరిన్ని మొబైళ్లను తీసుకొచ్చింది. Huawei Nova 16, Huawei Nova 16z స్మార్ట్‌ఫోన్లతో పాటు Huawei Nova 16 Pro, Huawei Nova 16 Ultra ప్రీమియం మొబైళ్లను తీసుకొచ్చింది.

Huawei Nova 16 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచేందుకు చైనా టెక్ దిగ్గజం హువావే కొత్తగా మరిన్ని మొబైళ్లను తీసుకొచ్చింది. Huawei Nova 16, Huawei Nova 16z స్మార్ట్‌ఫోన్లతో పాటు Huawei Nova 16 Pro, Huawei Nova 16 Ultra ప్రీమియం మొబైళ్లను తీసుకొచ్చింది. ప్రీమియం ఫోన్లలో భారీ బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరా, శక్తివంతమైన ఫీచర్లను జోడించింది.

ధర ఎంతంటే..!

Huawei Nova 16 స్మార్ట్‌ఫోన్‌ను 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 2999 (సుమారు రూ.42వేలు)గా నిర్ణయించింది. 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను CNY3499(సుమారు రూ.49వేలు)గా ఖరారు చేసింది. Huawei Nova 16z బేస్ వేరియంట్ ధరను CNY 2699(సుమారు రూ.38వేలు), 512జీబీ వేరియంట్ ధరను CNY 3199(సుమారు రూ.45వేలు)గా నిర్ణయించింది.

ఇక Huawei Nova 16 Pro స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3899(సుమారు రూ.54వేలు)గా నిర్ణయించింది. 512జీబీ వేరియంట్ ధరను CNY 4399(సుమారు రూ.61వేలు), 1టీబీ స్టోరేజ్ ధర CNY 4999(సుమారు రూ.68వేలు)గా ఖరారు చేసింది. Huawei Nova 16 Ultra స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను CNY 4699(సుమారు రూ.65వేలు)గా నిర్ణయించింది. 512జీబీ వేరియంట్ ధరను CNY 5199(సుమారు రూ.72వేలు), 1టీబీ వేరియంట్ ధర CNY 5799(సుమారు రూ.81వేలు)గా ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ మొబైళ్లు చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Huawei Nova 16 ఫీచర్లు

Huawei Nova 16 లో 6.68 అంగుళాల ఫుల్ హెడ్‌డీ +OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. అల్యూమినోసిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్‌లో Kirin 9010S చిప్‌సెట్‌ను అమర్చారు. అదనంగా IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా కల్పించారు.

ఫొటోగ్రఫీపరంగా ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. ఈ కెమెరా 3.3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్, ఆప్టికల్ జూమ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 100W వైర్డ్‌ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది.

Huawei Nova 16 z ఫీచర్లు

Huawei Nova 16z మొబైల్‌లో 6.7 అంగుళాల OLED డిస్‌ప్లే, kirin 8020 చిప్‌సెట్‌ను అందించారు. ఇందులో కూడా 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కానీ టెలిఫొటో కెమెరాను 12మెగాపిక్సెల్‌కు పరిమితం చేశారు. ఇది 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌కు 6000mah బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది.

Huawei Nova 16 Pro, Ultra మోడళ్ల ఫీచర్లు

Huawei Nova 16 Pro మోడల్‌లో 6.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ OLED LTPO డిస్‌ప్లేను అందించారు. 1320*2856 పిక్సెల్ రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్ 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది. 2160Hz PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, కున్‌లున్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కల్పించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Harmony OS 6.1పై పనిచేస్తుంది.

ఫొటోగ్రఫీ కోసం ఇందులో 200మెగాపిక్సెల్ RYYB ప్రధాన కెమెరా(OIS), 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్(3.7x ఆప్టికల్ జూమ్, OIS), 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ మాక్రో కెమెరా, రెడ్ మాపుల్ కలర్ సెన్సర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను అందించారు.

Huawei Nova 16 Ultra మొబైల్‌లో కూడా దాదాపు Huawei Nova 16 Proలో ఉన్న ఫీచర్లే ఉన్నప్పటికీ Ultra మోడల్‌కు IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే దుమ్ము, నీటి తుంపరల నుంచి మరింత మెరుగైన భద్రత లభిస్తుంది.

ఈ రెండు ఫోన్లలోనూ 7000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇందులో 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది. Nova 16 Ultraలో అదనంగా 50W వైర్‌లెస్ చార్జింగ్, 7.5W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు కల్పించారు.

 

 

 

Latest News