Motorola Edge 70 Pro+ | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకునేందుకు మోటరోలా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్‌ను విడుదల చేసింది. తాజాగా ఈ సిరీస్‌లో నాలుగో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ పేరుతో ఈ మోడల్‌ను తీసుకురానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రో సైట్‌లో కెమెరా ఫీచర్లు, డిజైన్, కలర్ ఆప్షన్స్ వంటి కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.. 50X డిజిటల్ జూమ్
ఇప్పటికే ఎడ్జ్ 70 సిరీస్‌లో ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ఫ్యూజన్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎడ్జ్ 70 ప్రో+ రానుంది. మోటరోలా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50మెగాపిక్సెల్ సోనీ LYT-710 సెన్సర్‌తో ప్రైమరీ కెమెరా వస్తుంది. ఇది 3.5 డిగ్రీల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ను సపోర్టు చేయనుంది. దీనివల్ల కదులుతున్నప్పుడు కూడా స్పష్టమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఈ మొబైల్‌లో 50 రెట్లు డిజిటల్ జూమ్ ఫీచర్ ఉండనుంది. సూపర్ జూమ్ ప్రో టెక్నాలజీ ద్వారా దూరంలో ఉన్న వస్తువులను కూడా మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చని మోటరోలా కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌లోని కెమెరాల్లో ఒకటి 81 మిల్లీమీటర్ల ఫోకల్ లెంగ్త్‌తో ఉండనున్నట్లు సమాచారం.
కలర్ ఆప్షన్లు
ఈ మొబైల్ మూడు ప్రత్యేక రంగుల్లో విడుదల కానుంది Pantone Chicory Coffee, Pantone Stormy Sea, Pantone Zinfandel పేర్లతో అందుబాటులోకి రానుంది. వీటిలో చెక్క ఆకృతిని పోలిన ఫినిష్, ట్విల్ డిజైన్, సాటిన్ లక్స్ ఫినిష్ వంటి ప్రత్యేక డిజైన్ టచ్‌లు ఉంటాయని సంస్థ పేర్కొంది.
డిజైన్
డిజైన్ పరంగా ఇది ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను పోలి ఉంటుంది. చతురస్రాకార కెమెరా మాడ్యు్ల్, ఫ్లాట్ రియర్ ప్యానెల్, కర్వ్‌డ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ మొబైల్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ హోల్ పంచ్ డిస్‌ప్లే కట్అవుట్ ఉంటుంది. కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్.. ఎడమ వైపున మరో ప్రత్యేక బటన్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఎడ్జ్ 70 ప్రోతో పోలిస్తే ఈ ప్రో ప్లస్ మోడల్‌లో టెలిఫొటో కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు, గరిష్టంగా 16 జీబీ ర్యామ్ వంటి అదనపు ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. ఇక ఈ ఫోన్ త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్టు ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుందని మోటరోలా కంపెనీ ప్రకటించింది.
Read More:
200మెగాపిక్సెల్ కెమెరాతో ఒప్పో రెనో 16 మొబైల్.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
7500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వివో నుంచి S60.. ఎప్పుడు లాంచ్ అంటే..!
