Noble Price In Medicine 2025: వైద్య శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ ప్రైజ్

రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలకుగాను అమెరికాకు చెందిన మేరీ ఇ బ్రుంకో, ఫ్రెడ్ రామ్‌స్‌డెల్, జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో 2025 నోబెల్ ప్రైజ్ లభించింది.

Noble Price In Medicine 2025: వైద్య శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ ప్రైజ్

విధాత : 2025 వైద్య శాస్త్రంలో విశేష సేవలందించిన అమెరికాకు చెందిన మేరీ ఇ బ్రుంకో, ఫ్రెడ్ రామ్‌స్‌డెల్, జపాన్‌కు చెంది షిమోన్ సకాగుచిలకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది . రోగనిరోధక వ్యవస్థ పై చేసిన పరిశోధనలకుగాను వారికి నోబెల్ పురస్కారం లభించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరి పరిశోధనలు ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్‌’ (peripheral immune tolerance) అనే శరీర రక్షణ వ్యవస్థలోని కీలక ప్రక్రియను ఆవిష్కరించాయి. శరీరం తన సొంత కణాలపై దాడి చేయకుండా ఇది కాపాడుతుంది. ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల నివారణలో ఇది అత్యంత కీలకమైన యాంత్రికతగా భావిస్తున్నారు. ఇమ్యూనాలజీ, చికిత్స శాస్త్ర అభివృద్ధికి వీరి కృషి మార్గదర్శకమని నోబెల్‌ జ్యూరీ పేర్కొన్నది.

మెరీ ఈ. బ్రంకోవ్‌

మేరీ బ్రంకోవ్‌.. 1961లో జన్మించారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం సియాటెల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సిస్టమ్స్‌ బయాలజీ విభాగంలో సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్రెడ్‌ రామ్‌డెల్‌తో కలిసి ఆమె 2011లో Foxp3 జీన్‌లోని మ్యూటేషన్‌ గుర్తించారు. ఇది “స్కర్ఫీ ఎలుకలు” (scurfy mice)లో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతుంది. ఈ ఆవిష్కరణతో రెగ్యులేటరీ T కణాల జన్యుపరమైన ఆధారం, అవి ఇమ్యూన్ టాలరెన్స్‌లో పోషించే పాత్రపై స్పష్టత వచ్చింది.

ఫ్రెడ్ రామ్‌డెల్‌

1960లో జన్మించిన రామ్‌డెల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏజలీస్‌లో ఇమ్యూనాలజీలో పీహెడ్‌డీ చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యుటిక్స్‌ సహా వివిధ బయోటెక్‌ సంస్థల్లో సీనియర్‌ స్థాయి పదవులు చేపట్టారు. ఆయన పరిశోధన Foxp3 జీన్‌లోని లోపంతో ఇటో ఇమ్యూన్‌ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపించింది. IPEX సిండ్రోమ్‌ వంటి రుగ్మతలకు టార్గెటెడ్‌ థెరపీల అభివృద్ధికి పునాదిగా నిలిచింది.

జేపీ షిమోన్ సాకగుచి

1951లో జపాన్‌లో జన్మించిన షిమోన్ సాకగుచి.. కియోటో వర్సిటీ నుండి ఎంసీ, పీహెచ్‌డీ పట్టాలు పుచ్చుకున్నారు. ఒసాకా యూనివర్సిటీలో ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో కీలక ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1995లో రెగ్యులేటరీ టీ కణాలను (Regulatory T cells) కనుగొన్నారు. థైమస్ కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థకు మించి ఇమ్యూన్ టాలరెన్స్‌లోని కొత్త స్థాయిని ఆయన పరిశోధన బయటపెట్టింది. ఆయన పరిశోధనలు ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీలో విప్లవాత్మక దారులను తెరిచాయి.

ఆవిష్కరణల ప్రభావం.. శరీర రక్షణ శాస్త్రానికి కొత్త దిశ

బ్రంకోవ్‌, రామ్‌డెల్‌, సాకగుచి ఆవిష్కరణలు ఇమ్యూనాలజీ రంగంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. శరీర రక్షణ వ్యవస్థ సొంతంగా ఎలా కణాలను దాడి చేయకుండా నిరోధిస్తుందో వీరి పరిశోధనలు చూపించాయి. వీటితో ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు కొత్త చికిత్సలు, సురక్షిత ఆటో స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలు సాధ్యమయ్యాయి.