దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత జట్టు 140 పరుగులకే అలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు భారత్ పై 408 పరుగుల తేడాతో నెగ్గింది. దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హర్మర్ ఆరు వికెట్లు తీసి భారత జట్టు వెన్ను వెరిచారు. ఇక భారత జట్టులో రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ జట్టు కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత జట్టుపై దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంది. రెండు టెస్టుల్లో భారత్ ఓటమి పాలైంది. దీంతో భారత్ జట్టు 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. అయిదో రోజు ఆట ప్రారంభించిన తర్వాత భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో అయిదో రోజు ఆటను భారత జట్టు ప్రారంభించింది. 37 పరుగులిచ్చి ఐదు ఆరు వికెట్లను దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ ఆర్మర్ తన ఖాతాలో వేసుకున్నారు. 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును రవీంద్ర జడేజా 54 పరుగులు చేయడంతో భారత జట్టు కనీసం 140 పరుగులైనా చేయగలిగింది. యశస్వి జైపాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి దక్షిణాఫ్రికా బౌలర్లకు చిక్కారు. సాయి సుదర్శన్ క్రీజులో 139 బంతులు ఎదుర్కొన్నారు. కానీ, ఆయనకు సరైన సహకారం దొరకలేదు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు భారత్ అలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులకే అలౌట్ అయింది. ఇంత భారీ స్కోర్ తో భారత జట్టు ఓటమి పాలైంది. 2004 లో అస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
India Vs South Africa | దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో భారత్ ఓటమి: 25 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం చేసుకున్న సఫారీ టీమ్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 408 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా 25 ఏళ్ల తర్వాత భారత్‌పై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Latest News
బాలయ్య అభిమానులకి మరో పండుగ
వారణాసి ఈవెంట్లో మహేష్ ఎంట్రీ సీన్ కోసం ఇంత కష్టపడ్డరా
ఆమెకి లవ్ లెటర్ రాస్తే, తీసుకెళ్లి ఏకంగా నా భార్యకి ఇచ్చింది
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సర్పంచుల జీతంపై సర్వత్రా చర్చ..!
2026 ఫిబ్రవరి 17 వరకు పెళ్లిళ్లకు ముహుర్తాలు లేనట్లే..! అసలు కారణం ఇదే..!!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి బంధువులతో విభేదాలు..!
డీసీసీల ఎంపికపై సీనియర్ల నారాజ్!
టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ రిలీజ్.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
అగ్ని పర్వతాల బూడిద వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది?
భర్తపై గృహహింస కేసు పెట్టిన బాలీవుడ్ నటి