IPL 2024| ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లే ఆఫ్ రేసు.. బెంగ‌ళూరుని ల‌క్ వ‌రిస్తుందా?

IPL 2024| ఐపీఎల్ స‌మ‌రం తుది ద‌శ‌కు చేరుకుంది. ఏయే జ‌ట్లు ప్లేఆఫ్‌కి చేరుకుంటాయి, ఏయే జ‌ట్లు ఐపీఎల్ నుండి త‌ప్పుకుంటాయి అనే దానిపై జోరుగా చర్చ‌లు న‌డుస్తు

  • By: sn    sports    May 12, 2024 12:37 PM IST
IPL 2024| ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లే ఆఫ్ రేసు.. బెంగ‌ళూరుని ల‌క్ వ‌రిస్తుందా?

IPL 2024| ఐపీఎల్ స‌మ‌రం తుది ద‌శ‌కు చేరుకుంది. ఏయే జ‌ట్లు ప్లేఆఫ్‌కి చేరుకుంటాయి, ఏయే జ‌ట్లు ఐపీఎల్ నుండి త‌ప్పుకుంటాయి అనే దానిపై జోరుగా చర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే పంజాబ్, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు అధికారికంగా ఐపీఎల్ నుండి నిష్క్ర‌మించాయి. ఇక ముంబై ఇండియ‌న్స్‌పై స్ట‌న్నింగ్ విజ‌యం సాధించిన కేకేఆర్ ప్లే ఆఫ్ చేరిన తొలి జ‌ట్టుగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో ప్లేఆఫ్ రేసులో మూడు స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాజ‌స్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్ చేర‌డం దాదాపు ఖాయ‌మే. ఇక మిగిలింది చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు . వీరు రెండు స్థానాల కోసం పోటీ ప‌డ‌నున్నారు.

ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో చూస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పాయింట్లతో టాప్‌లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. అయితే ఏడు జ‌ట్ల‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. సీఎస్కే మొత్తం 12 మ్యాచ్‌లు ఆడ‌గా, అందులో ఆరు గెలిచి 12 పాయింట్ల‌ని సంపాదించుకుంది.

ఈ రోజు ఆర్ఆర్ తో చెన్నై త‌ల‌ప‌డ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌లో త‌ప్పనిస‌రిగా సీఎస్కే గెల‌వాల్సి ఉంటుంది. ఇది గెలిచి మ‌రో మ్యాచ్ కూడా గెలిస్తే చెన్నైకి తిరుగు లేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. అప్పుడే వారు 16 పాయింట్లు సంపాదిస్తారు. అయితే ఇవి రెండు 16 పాయింట్లు సంపాదిస్తే ఆర్సీబీ ప‌ని అయిపోయిన‌ట్టే. ఈ జ‌ట్టు కూడా 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లను కలిగి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచిన‌, వారు 14 పాయింట్లకు మించి ఎక్కువ పొంద‌లేరు. దీంతో వారి ల‌క్ ఇత‌ర జ‌ట్ల‌పై ఆధార‌పడాల్సి ఉంటుంది. రాజస్థాన్​తో చెన్నై తలపడనుండగా.. ఆర్సీబీ-డీసీ ఫైట్ చేయ‌నున్నాయి. నేటి మ్యాచ్‌లతో ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది.